సైనేడ్‌ కత్తితో వైసీపీ నేత మోకా భాస్కరరావు హత్య

కృష్ణా జిల్లా మచిలీపట్నంలో వైసీపీ నేత హత్యజరిగింది. మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్‌ మోకా భాస్కరరావును దుండగులు కత్తులతో పొడిచి చంపారు. మచిలీపట్నం చేపల మార్కెట్‌ వద్ద ఈ ఘటన జరిగింది. ఇద్దరు వ్యక్తులు వచ్చి మోకా భాస్కరరావు చాతీపై కత్తితో దాడి చేశారు.

నెత్తుటిమడుగులో పడి ఉన్న భాస్కరరావును స్థానికులు ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ చనిపోయారు.

కత్తులకు సైనేడ్ పూసి వాటితో పొడిచినట్టు వైద్యులు భావిస్తున్నారు. ఇది ముమ్మాటికి రాజకీయ హత్యేనని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. మోకా భాస్కరరావుతో విబేధాలున్న ఒక టీడీపీ నేత ఈ హత్య చేయించినట్టు ఆరోపిస్తున్నారు.