Telugu Global
International

భారత భూభాగాన్ని ఆక్రమించిన చైనా...

మన దేశ భూభాగాన్ని చైనా ఏమాత్రం ఆక్రమించలేదని ప్రధాని నరేంద్రమోడీ ఇటీవల చెప్పారు. అయితే ఉపగ్రహ ఛాయాచిత్రాలు మాత్రం అందుకు భిన్నమైన వాస్తవాన్ని చెబుతున్నాయి. భారత భూభాగంలోకి 423 మీటర్ల మేర చైనా చొచ్చుకొచ్చింది. 1960లో చైనా స్వయంగా తనకు తాను ప్రకటించుకున్న సరిహద్దును దాటి వచ్చి భారత భూభాగాన్ని ఆక్రమించింది. చొచ్చుకొచ్చిన ఈ 423 మీటర్ల భారత భూభాగంలో చైనా ఇప్పుడు నిర్మాణాలు కూడా చేపట్టింది. ఈ అంశాన్నీ ఉపగ్రహ ఛాయచిత్రాల్లో స్పష్టంగా కనిపిస్తున్నాయి. 16 […]

భారత భూభాగాన్ని ఆక్రమించిన చైనా...
X

మన దేశ భూభాగాన్ని చైనా ఏమాత్రం ఆక్రమించలేదని ప్రధాని నరేంద్రమోడీ ఇటీవల చెప్పారు. అయితే ఉపగ్రహ ఛాయాచిత్రాలు మాత్రం అందుకు భిన్నమైన వాస్తవాన్ని చెబుతున్నాయి.

భారత భూభాగంలోకి 423 మీటర్ల మేర చైనా చొచ్చుకొచ్చింది. 1960లో చైనా స్వయంగా తనకు తాను ప్రకటించుకున్న సరిహద్దును దాటి వచ్చి భారత భూభాగాన్ని ఆక్రమించింది.

చొచ్చుకొచ్చిన ఈ 423 మీటర్ల భారత భూభాగంలో చైనా ఇప్పుడు నిర్మాణాలు కూడా చేపట్టింది. ఈ అంశాన్నీ ఉపగ్రహ ఛాయచిత్రాల్లో స్పష్టంగా కనిపిస్తున్నాయి. 16 గుడారాలు, టార్పాలిన్లు, ఒక భారీ నిర్మాణాన్ని చైనా సైనికులు ఏర్పాటు చేసుకున్నారు.

కేవలం భారత భూభాగాన్ని ఆక్రమించడమే కాకుండా చొచ్చుకొచ్చిన ప్రాంతాల్లో నిర్మాణాలను కూడా చైనా చేపడుతున్న నేపథ్యంలో … చర్చలు జరిపినా తిరిగి వెనక్కు వెళ్లే ఉద్దేశం చైనాకు లేదన్నది స్పష్టమవుతోంది.

భారత భూభాగాన్ని చైనా ఆక్రమించలేకపోయిందని ప్రధాని చెప్పగా… ఇప్పుడు అందుకు భిన్నంగా ఉపగ్రహ ఛాయచిత్రాలు ఉండడంతో అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఉపగ్రహ ఛాయచిత్రాలకు కేంద్ర ప్రభుత్వం ఏం సమాధానం ఇస్తుందో చూడాలి.

First Published:  29 Jun 2020 10:34 PM GMT
Next Story