Telugu Global
National

కొండపోచమ్మ కాలువకు గండి... లోపం ఎక్కడ?

సిద్ధిపేట జిల్లా మర్కుక్‌ మండలం శివారు వెంకటాపురం వద్ద కొండపోచమ్మ సాగర్‌ కాలువకు గండిపడింది. నీరు గ్రామాల్లోకి ప్రవేశించింది. పంట పొలాలు నీట మునిగాయి. జగదేవ్‌పూర్‌, ఆలేరు నియోజకవర్గాల్లోని చెరువులను నింపేందుకు నీటిని విడుదల చేసిన సమయంలో ఈ ఘటన జరిగింది. కాళేశ్వరం ప్రాజెక్టు ప్రధాన పనులను మేఘా ఇంజనీరింగ్‌ సంస్థ నిర్వహించగా… మిగిలిన కాలువల నిర్మాణాలు, చిన్నచిన్న పనులను ప్రభుత్వం స్థానిక కాంట్రాక్టర్లకు అప్పగించింది. కొండపోచమ్మ సాగర్ కాలువ పనులను తీసుకున్న స్థానిక కాంట్రాక్టర్‌ సరైన […]

కొండపోచమ్మ కాలువకు గండి... లోపం ఎక్కడ?
X

సిద్ధిపేట జిల్లా మర్కుక్‌ మండలం శివారు వెంకటాపురం వద్ద కొండపోచమ్మ సాగర్‌ కాలువకు గండిపడింది. నీరు గ్రామాల్లోకి ప్రవేశించింది. పంట పొలాలు నీట మునిగాయి. జగదేవ్‌పూర్‌, ఆలేరు నియోజకవర్గాల్లోని చెరువులను నింపేందుకు నీటిని విడుదల చేసిన సమయంలో ఈ ఘటన జరిగింది.

కాళేశ్వరం ప్రాజెక్టు ప్రధాన పనులను మేఘా ఇంజనీరింగ్‌ సంస్థ నిర్వహించగా… మిగిలిన కాలువల నిర్మాణాలు, చిన్నచిన్న పనులను ప్రభుత్వం స్థానిక కాంట్రాక్టర్లకు అప్పగించింది. కొండపోచమ్మ సాగర్ కాలువ పనులను తీసుకున్న స్థానిక కాంట్రాక్టర్‌ సరైన నాణ్యతా ప్రమాణాలు పాటించకపోవడం వల్లే గండిపడినట్టు చెబుతున్నారు.

అయితే కొందరు రాజకీయ నాయకులు మాత్రం ఈ పనులు కూడా మేఘా ఇంజనీరింగ్‌ సంస్థే చేసిందంటూ సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు. మేఘా సంస్థను బ్లాక్‌మెయిల్‌ చేసేందుకు ఇలా కొందరు నాయకులు ప్రతి అంశాన్ని ఆ కంపెనీ మెడకు చుట్టే ప్రయత్నం చేస్తున్నారని నీటిపారుదల శాఖ అధికారులు అభిప్రాయపడుతున్నారు.

First Published:  30 Jun 2020 4:11 AM GMT
Next Story