Telugu Global
NEWS

విశాఖలో గ్యాస్ లీక్... ఇద్దరు మృతి

విశాఖలో మరో గ్యాస్‌ ప్రమాదం జరిగింది. పరవాడ ఫార్మా సిటీలోని సాయినార్‌ కెమికల్స్‌ నుంచి గ్యాస్ లీక్ అయింది. రియాక్టర్ నుంచి హైడ్రోజన్ సల్పైడ్‌ అధిక మోతాదులో లీక్‌ అయింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. మరో నలుగురు అస్వస్థతకు గురయ్యారు. మృతులు షిప్ట్ ఇన్‌చార్జ్ నరేంద్ర, కెమిస్ట్‌ గౌరిశంకర్‌గా గుర్తించారు. ఘటనా స్థలిని కలెక్టర్‌, నగర పోలీస్ కమిషనర్ పరిశీలించారు. ప్రజలెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అధికారులు ప్రకటించారు. ఈ ఘటనపై విచారణకు […]

విశాఖలో గ్యాస్ లీక్... ఇద్దరు మృతి
X

విశాఖలో మరో గ్యాస్‌ ప్రమాదం జరిగింది. పరవాడ ఫార్మా సిటీలోని సాయినార్‌ కెమికల్స్‌ నుంచి గ్యాస్ లీక్ అయింది. రియాక్టర్ నుంచి హైడ్రోజన్ సల్పైడ్‌ అధిక మోతాదులో లీక్‌ అయింది.

ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. మరో నలుగురు అస్వస్థతకు గురయ్యారు.

మృతులు షిప్ట్ ఇన్‌చార్జ్ నరేంద్ర, కెమిస్ట్‌ గౌరిశంకర్‌గా గుర్తించారు. ఘటనా స్థలిని కలెక్టర్‌, నగర పోలీస్ కమిషనర్ పరిశీలించారు. ప్రజలెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అధికారులు ప్రకటించారు.

ఈ ఘటనపై విచారణకు నలుగురు అధికారులతో కమిటీని కలెక్టర్ ఏర్పాటు చేశారు. ఘటనపై ముఖ్యమంత్రి జగన్‌మోహన్ రెడ్డి ఆరా తీశారు. అస్వస్థతకు గురైన వారికి మెరుగైన వైద్యం అందేలా చూడాలని ఆదేశించారు.

ముందు జాగ్రత్తగా ఫ్యాక్టరీని షట్‌డౌన్‌ చేయించినట్టు, ప్రమాదం ఫ్యాక్టరీలో ఓ రియాక్టర్‌ ఉన్న విభాగానికి పరిమితమని… ఎలాంటి ఆందోళన అవసరంలేదని అధికారులు సీఎంకు వివరించారు.

First Published:  29 Jun 2020 10:31 PM GMT
Next Story