Telugu Global
International

తండ్రిని చూడటానికి చిన్నపడవలో అట్లాంటిక్ సముద్రాన్ని దాటాడు

కరోనా వైరస్ ప్రపంచాన్ని గడగడలాడిస్తోంది. ఎంతో మంది తమ కుటుంబ సభ్యులకు దూరమయ్యారు. ఒకే దేశంలో ఉన్న వాళ్లు అష్ట కష్టాలు పడి నడిచో, ఏదో ఒక వాహనం మీద సొంతూర్లకు చేరుకున్నారు. కానీ పోర్చుగల్‌కు చెందిన ఒక వ్యక్తి మాత్రం వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న తండ్రిని కలుసుకోవడానికి ఏకంగా అట్లాంటిక్ మహాసముద్రాన్నే దాటేశాడు. అట్లాంటిక్ సముద్రంలో పోర్ట్ శాంటో అనేది ఒక అందమైన ద్వీపం. ఇది పోర్చుగల్ దేశం ఆధీనంలో ఉంది. ఇక్కడ కరోనా […]

తండ్రిని చూడటానికి చిన్నపడవలో అట్లాంటిక్ సముద్రాన్ని దాటాడు
X

కరోనా వైరస్ ప్రపంచాన్ని గడగడలాడిస్తోంది. ఎంతో మంది తమ కుటుంబ సభ్యులకు దూరమయ్యారు. ఒకే దేశంలో ఉన్న వాళ్లు అష్ట కష్టాలు పడి నడిచో, ఏదో ఒక వాహనం మీద సొంతూర్లకు చేరుకున్నారు. కానీ పోర్చుగల్‌కు చెందిన ఒక వ్యక్తి మాత్రం వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న తండ్రిని కలుసుకోవడానికి ఏకంగా అట్లాంటిక్ మహాసముద్రాన్నే దాటేశాడు.

అట్లాంటిక్ సముద్రంలో పోర్ట్ శాంటో అనేది ఒక అందమైన ద్వీపం. ఇది పోర్చుగల్ దేశం ఆధీనంలో ఉంది. ఇక్కడ కరోనా కేసులు ఏమీ లేవు. అయితే జువాన్ మాన్యువల్ బల్లెస్టెరో (47) అక్కడ ఒంటరిగా ఉండదలచుకోలేదు. తన తండ్రి కార్లోస్‌ను కలుసుకొని, తన 90వ పుట్టిన రోజును ఘనంగా జరపాలని అనుకున్నాడు. అయితే అంతర్జాతీయ విమానాలేవీ లేకపోవడంతో తన 29 అడుగుల సొంత పడవలో సముద్రానికి అవతల ఉన్న అర్జంటీనాకు బయలుదేరాడు.

మార్చి రెండో వారంలో తన బోట్‌లో క్యాన్డ్ ట్యూనా ఫిష్, పండ్లు, అన్నం సర్థుకొని బయలుదేరాడు. కరోనా సమయంలో సముద్రంలో ప్రయాణించడం అతనికి ప్రమాదకరమైన విషయమే. ఒకవేళ అతడికి కరోనా ఉండి ఉంటే సముద్రం మధ్యలోనే చనిపోయేవాడు. మూడు వారాల తర్వాత అతను కేప్ వెర్డేకి చేరుకున్నాడు. కానీ అక్కడి అధికారులు అతడిని ఓడరేవులోకి అనుమతించలేదు. దాంతో ఏం చేయాలో తోచలేదు.

చివరికి జూన్ 17న అతడు తన సొంత ఊరు మార్ డెల్ ప్లాటాకు చేరుకున్నాడు. 85 రోజులు అట్లాంటిక్‌ను దాటి వచ్చాడని తెలిసి అక్కడ ప్రజలు అతడికి ఘనమైన స్వాగతం తెలిపారు. వచ్చిన వెంటనే అధికారులు అతడికి కరోనా పరీక్ష చేయగా నెగెటివ్ వచ్చింది. ఆ తర్వాత అతడిని దేశంలోకి అనుమతించారు.

మే నెలో తన తండ్రి పుట్టిన రోజును మిస్ అయిన అతడు.. తిరిగి మళ్లీ జూన్‌లో ఘనంగా వేడుకలు జరిపాడు. ఇప్పుడు అర్జంటీనాలో అతనో ప్రముఖ వ్యక్తిగా మారిపోయాడు.

First Published:  30 Jun 2020 10:16 AM GMT
Next Story