Telugu Global
National

రఘురామకృష్ణంరాజుపై వేటుకు రంగం సిద్ధం

వైసీపీకి ఇరిటేషన్ తెప్పించాలని ప్రయత్నించిన రఘురామకృష్ణంరాజుపై వైసీపీ ప్రతివ్యూహం సిద్ధం చేస్తోంది. సస్పెన్షన్ వేటు వేయించుకుని బయటకు వెళ్లి… బీజేపీలో చేరాలన్న వ్యూహంతోనే రఘురామకృష్ణంరాజు ఇలా చేస్తున్నారని అంచనాకు వచ్చిన వైసీపీ పెద్దలు అందుకు కౌంటర్ షాక్ ఇవ్వబోతున్నారు. సస్పెన్షన్‌ వేటు వేయకుండా నేరుగా ఎంపీ పదవినే ఊడగొట్టించాలని భావిస్తోంది. వ్యక్తిగతంగా ఒకవైపు ప్రశంసిస్తూనే… మరోవైపు అసలు వైసీపీ పార్టీ ఉనికినే ప్రశ్నించేలా, అసలు వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అన్న పదాన్ని ఎలా వాడుతారు అంటూ రఘురామకృష్ణంరాజు […]

రఘురామకృష్ణంరాజుపై వేటుకు రంగం సిద్ధం
X

వైసీపీకి ఇరిటేషన్ తెప్పించాలని ప్రయత్నించిన రఘురామకృష్ణంరాజుపై వైసీపీ ప్రతివ్యూహం సిద్ధం చేస్తోంది. సస్పెన్షన్ వేటు వేయించుకుని బయటకు వెళ్లి… బీజేపీలో చేరాలన్న వ్యూహంతోనే రఘురామకృష్ణంరాజు ఇలా చేస్తున్నారని అంచనాకు వచ్చిన వైసీపీ పెద్దలు అందుకు కౌంటర్ షాక్ ఇవ్వబోతున్నారు.

సస్పెన్షన్‌ వేటు వేయకుండా నేరుగా ఎంపీ పదవినే ఊడగొట్టించాలని భావిస్తోంది. వ్యక్తిగతంగా ఒకవైపు ప్రశంసిస్తూనే… మరోవైపు అసలు వైసీపీ పార్టీ ఉనికినే ప్రశ్నించేలా, అసలు వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అన్న పదాన్ని ఎలా వాడుతారు అంటూ రఘురామకృష్ణంరాజు ప్రదర్శిస్తున్న తెలివితేటలపై ముఖ్యమంత్రి ఆగ్రహంగా ఉన్నారని వైసీపీ నేతలు చెబుతున్నారు.

ఒకవేళ ప్రభుత్వంపై సదుద్దేశంతోనే విమర్శలు చేసి ఉంటే… షోకాజ్‌ నోటీసులో వాటికి సానుకూలంగా వివరణ ఇవ్వాల్సిందిపోయి… స్పీకర్‌ను కలవడం, ఈసీని కలిసి అసలు వైసీపీలో క్రమశిక్షణ సంఘం ఉందా అని ఆరా తీయడం, వైసీపీ పేరును వాడుకోవడాన్ని తప్పుపట్టడం వంటి చర్యలను బట్టి రఘురామకృష్ణంరాజు కావాలనే రెచ్చగొడుతున్నారన్న నిర్ధారణకు వైసీపీ వచ్చింది.

ఈ నేపథ్యంలో సస్పెండ్ చేయకుండా నేరుగా అనర్హత పిటిషన్ దాఖలు చేయాలని వైసీపీ నిర్ణయించుకుంది. ఈ అంశంపై ఇది వరకే వైసీపీ ఎంపీల బృందం లోక్‌సభ స్పీకర్‌ను కలిసి రఘురామకృష్ణంరాజు వ్యవహారశైలిని ఆయన దృష్టికి తీసుకెళ్లింది.

అనర్హత పిటిషన్‌ దాఖలు చేస్తే బీజేపీ కూడా రఘురామకృష్ణంరాజుకు అండగా ఉండే పరిస్థితి లేదని వైసీపీ నేతలు చెబుతున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒక ఎంపీ కోసం … వైసీపీలాంటి తటస్థ పార్టీతో కేంద్రం విభేదాలు సృష్టించుకునే అవకాశమే లేదని… అనర్హత పిటిషన్‌ దాఖలు చేస్తే గతంలో శరద్‌యాదవ్‌ తరహాలోనే రఘురామకృష్ణంరాజు కూడా ఎంపీ పదవి కోల్పోతారని వైసీపీ ధీమాగా చెబుతోంది.

First Published:  30 Jun 2020 10:10 PM GMT
Next Story