లవ్ స్టోరీకి అప్పుడే 16 కోట్లు

నాగచైతన్య, సాయిపల్లవి క్రేజీ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న లవ్ స్టోరీ సినిమా రిలీజ్ కు ముందే మంచి లాభాలు కొల్లగొడుతోంది. ఈ సినిమా నాన్-థియేట్రికల్ రైట్స్ 16 కోట్ల రూపాయలకు అమ్ముడుపోయాయి. దీంతో నిర్మాతలకు రిలీజ్ కు ముందే సగం పెట్టుబడి వెనక్కి వచ్చినట్టయింది. థియేట్రికల్ రిలీజ్ లో హిట్ టాక్ వస్తే సినిమాకు లాభాల పంటే.

ఇక నాన్-థియేట్రికల్ బిజినెస్ విషయానికొస్తే ఈ సినిమా డిజిటల్ రైట్స్ ను అల్లు అరవింద్ కు చెందిన ఆహా యాప్ దక్కించుకుంది. ఏకంగా 6 కోట్ల రూపాయల మొత్తానికి ఈ సినిమా స్ట్రీమింగ్ రైట్స్ దక్కించుకున్నారు వాళ్లు. ఆహా యాప్ లో ఇప్పటివరకు కొనుగోలు చేసిన సినిమాల్లో అత్యథిక ధర ఇదే.

ఇక శాటిలైట్, హిందీ డబ్బింగ్ రైట్స్ కింద ఈ సినిమాకు మరో 10 కోట్ల రూపాయలు వచ్చాయి. ఈ సినిమా తెలుగు శాటిలైట్ రైట్స్ ను స్టార్ మా ఛానెల్ దక్కించుకుంది. ఫిదా లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత శేఖర్ కమ్ముల తీస్తున్న సినిమా కావడంతో పాటు.. నాగచైతన్య-సాయిపల్లవికి యూత్ లో మంచి క్రేజ్ ఉండడంతో.. లవ్ స్టోరీ సినిమా హాట్ కేక్ గా మారింది.