నెలలో 50 సిమ్ కార్డులు మార్చాడు

చాలామంది అనుమానిస్తున్నట్టుగానే సుశాంత్ ఆత్మహత్యపై నటుడు, టీవీ వ్యాఖ్యాత శేఖర్ సుమన్ కూడా అనుమానాలు వ్యక్తంచేశాడు. ఒకే నెలలో సుశాంత్ 50 సిమ్ కార్డులు మార్చాడని, ఈ విషయంపై పోలీసులు దృష్టి పెట్టాలని ఆయన డిమాండ్ చేశాడు.

జస్టిస్ ఫర్ సుశాంత్ పేరిట ఓ ఫోరమ్ ప్రారంభించిన శేఖర్ సుమన్.. సుశాంత్ ఆత్మహత్య చేసుకునేంత పిరికివాడు కాదని అంటున్నాడు. దీంతో పాటు ఆయన మరో అనుమానాన్ని కూడా వ్యక్తంచేశాడు. సుశాంత్ అపార్ట్ మెంట్ డూప్లికేట్ తాళాలు ఎందుకు ప్లేస్ మారాయో ఎంక్వయిరీ చేయాలన్నాడు.

ఓవైపు డూప్లికేట్ తాళాలు ఉండాల్సిన స్థానంలో లేకుండా వేరే చోట ఉండడం, మరోవైపు సుశాంత్ 50 సిమ్ కార్డులు మార్చడం వెనక ఏదో కుట్ర ఉంటుందని అనుమానించాడు. ఇలా సుశాంత్ ఆత్మహత్య వెనక కంటికి కనిపించని విషయాలు చాలా ఉన్నాయని చెప్పుకొచ్చాడు శేఖర్ సుమన్.