ఈ డైరక్టర్ అస్సలు తగ్గట్లేదుగా

సోషల్ మీడియాలో బోల్డ్ గా రియాక్ట్ అయ్యే సెలబ్రిటీస్ లో తరుణ్ భాస్కర్ కూడా ఒకడు. రీసెంట్ గా ఆయన చేసిన ఓ కామెంట్, కొంతమంది హీరోల ఫ్యాన్స్ కు కాస్త గట్టిగానే తగిలింది. దీంతో వాళ్లంతా మూకుమ్ముడిగా తరుణ్ భాస్కర్ పై దాడి చేశారు.

అయితే దీనికి తరుణ్ భాస్కర్ ఏమాత్రం చలించలేదు. పైపెచ్చు ఎదురుదాడికి దిగాడు. తనను ట్రోల్ చేసిన వాళ్లను కుక్కలతో పోలుస్తూ పెద్ద పోస్ట్ పెట్టాడు. దీంతో సదరు ఫ్యాన్ గ్రూపులు మరింత రెచ్చిపోయాయి. తరుణ్ ను నానా మాటలంటూ శాపనార్థాలు పెట్టాయి. అతడికి నిద్రలేకుండా చేశాయి.

ఇక ఈ వివాదానికి ఇక్కడితో ఫుల్ స్టాప్ పెట్టాలని నిర్ణయించుకున్నాడు తరుణ్. తనపై అసభ్యకంగా కామెంట్ చేసిన వ్యక్తులపై సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు ఫైల్ చేసిన పోలీసులు.. సదరు ఎకౌంట్లపై దృష్టిపెట్టారు.

తరుణ్ భాస్కర్ చేసిన పనితో అతడిపై కొంత ట్రోలింగ్ తగ్గుతుందని భావిస్తున్నారు. ఏదేమైనా సెలబ్రిటీలు ఒకప్పట్లా తమపై జరుగుతున్న ట్రోలింగ్ ను చూసీ చూడనట్టు వదిలేయడం లేదు. కాస్త గట్టిగానే రియాక్ట్ అవుతున్నారు. మొన్న విజయ్ దేవరకొండ, ఈసారి తరుణ్ భాస్కర్ దీనికి ఉదాహరణలుగా నిలిచారు.