కరోనాపై క్లారిటీ ఇచ్చిన సీరియల్ నటి

షూటింగ్స్ కు అనుమతి ఇచ్చారని ముందువెనక చూసుకోకుండా కొన్ని సీరియల్స్ షూటింగ్స్ ప్రారంభించాయి. కట్ చేస్తే, షూటింగ్ మొదలుపెట్టిన 2 రోజులకే కరోనా కేసులు బయటపడ్డాయి. ఒకేసారి 8 మంది నటీనటులకు కరోనా సోకింది. ఇప్పుడీ లిస్ట్ లోకి నవ్య అనే సీరియల్ హీరోయిన్ కూడా చేరిపోయింది.

నా పేరు మీనాక్షి సినిమాతో పాపులర్ అయిన నవ్యకు కరోనా సోకిందనే విషయం పాతదే. కాకపోతే ఆమె పరిస్థితి విషమంగా ఉందని, ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నారంటూ తాజాగా ప్రచారం ఊపందుకుంది. దీంతో స్వయంగా ఆ హీరోయిన్ రంగంలోకి దిగింది. తన ఆరోగ్య పరిస్థితిపై తానే ఓ వీడియో చేసి రిలీజ్ చేసింది.

తను ఐసీయూలో లేనని, వైద్యుల సలహా మేరకు స్వీయ నిర్బంధంలో ఉన్నానని స్వయంగా చెప్పుకొచ్చింది నవ్య. మంచి ఆహారం తీసుకోవడంతో పాటు టైమ్ కు మందులు వేసుకుంటున్నానని, త్వరలోనే కోలుకొని సెట్స్ పైకి వస్తానని వీడియో రిలీజ్ చేసింది. ఈమధ్యకాలంలో తనతో టచ్ లోకి వచ్చిన వాళ్లంతా కరోనా పరీక్షలు చేయించుకోవాలని కోరుతోంది ఈ ముద్దుగుమ్మ.