ఒకేసారి 4 సినిమాల రైట్స్ కొనేశాడు

నైజాం ఏరియాలో పాపుల‌ర్ డిస్ట్రిబ్యూట‌ర్ అయిన వ‌రంగ‌ల్ శ్రీ‌నివాస్‌, నాలుగు పెద్ద సినిమాల థియేట‌ర్ హ‌క్కులు పొందాడు. ర‌వితేజ నటిస్తున్న ‘క్రాక్‌’, గోపీచంద్ సినిమా ‘సీటీమార్‌’, శ‌ర్వానంద్ చిత్రం ‘శ్రీ‌కారం’, రానా చేస్తున్న ‘విరాట‌ప‌ర్వం’ సినిమాలకు సంబంధించి నైజాం థియేట్రికల్ రైట్స్ సొంతం చేసుకున్నాడు.

క‌రోనా మ‌హ‌మ్మారి వ్యాప్తి కార‌ణంగా థియేట‌ర్లు మూత‌ప‌డ‌క పోయిన‌ట్ల‌యితే ఈ పాటికి ఆ సినిమాల‌న్నీ విడుద‌లై ఉండేవి. ఈ మ‌ధ్య‌లో, ఆయ‌న మ‌రికొంత‌మంది స్టార్ హీరోల సినిమాల నైజాం హ‌క్కుల కోసం నిర్మాత‌ల‌తో సంప్ర‌దింపులు జ‌రుపుతున్నాడు.

ఓ వైపు డిస్ట్రిబ్యూష‌న్ చూసుకుంటూనే, ఇటీవ‌ల నిర్మాత‌గా కూడా మారాడు శ్రీనివాస్. ఆయ‌న నిర్మిస్తోన్న మొద‌టి చిత్రం షూటింగ్ స‌గం పూర్త‌యింది. మిగ‌తా షూటింగ్‌ను ఫారిన్ లొకేష‌న్ల‌లో నిర్వ‌హించేందుకు స‌న్నాహాలు చేస్తున్నారు. దీని త‌ర్వాత మరో రెండు కొత్త సినిమాలు నిర్మించేందుకు శ్రీ‌నివాస్ ప్లాన్ చేస్తున్నాడు.