22న ఏపీ కేబినెట్ విస్తరణ…!

ఏపీ కేబినెట్‌ విస్తరణ ఈనెల 22న జరిగే అవకాశాలున్నాయి. వైసీపీ మీడియా సంస్థే ఈ విషయాన్నివెల్లడించింది. రాజ్యసభకు ఎన్నికైన మంత్రులు మోపిదేవి వెంకటరమణ, పిల్లి సుభాష్ చంద్రబోస్‌లు రాజీనామా చేయడంతో ఖాళీ అయిన రెండు మంత్రి పదవులను ఇతరులతో భర్తీ చేయనున్నారు.

ఆషాడమాసం ముగిసిన తర్వాత శ్రావణమాసం ప్రారంభంలో మంత్రి వర్గ విస్తరణ ఉండే అవకాశం ఉంది. 22వ తేదీన కొత్త మంత్రుల చేత ప్రమాణస్వీకారం ఉంటుందని చెబుతున్నారు.

ప్రస్తుతం మంత్రి పదవులకు రాజీనామా చేసిన ఇద్దరు నేతలు బీసీ వర్గానికి చెందినవారు. కొత్త మంత్రులను కూడా బీసీ వర్గం నుంచే ముఖ్యమంత్రి ఎంపిక చేయనున్నారని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి.