ఇషా చావ్లా మళ్లీ వస్తానంటోంది….

ఇషా చావ్లా గుర్తుందా.. అప్పుడెప్పుడో బాలయ్య నటించిన శ్రీమన్నారాయణ సినిమాలో ఈమె హీరోయిన్ గా నటించింది. ఈమెకంటూ పెద్దగా గుర్తింపు తెచ్చిన సినిమాల్లేవ్. ఆమె కెరీర్ లో చేసిన పెద్ద సినిమా ఇది మాత్రమే. అలా నాలుగేళ్ల కిందటే ఫేడవుట్ అయిన ఈ ముద్దుగుమ్మ మరోసారి తెరపైకొస్తానంటోంది.

“ఈమధ్య మ్యూజికల్ టూర్స్ తో బిజీ అయ్యాను. దేవిశ్రీప్రసాద్ తో కలిసి మ్యూజికల్ టూర్స్ చేశాం. శ్రీలంకలో నా ప్రదర్శనకు మంచి పేరొచ్చింది. దీనికి తోడు కొన్నాళ్లు గ్యాప్ తీసుకొని అమెరికా వెళ్లిపోయాను. అందుకే సినిమాల్లో నటించలేకపోయాను. అంతే తప్ప, నేను సినిమాలకు దూరమైపోలేదు. త్వరలోనే మళ్లీ సినిమాల్లో కనిపిస్తా.”

ఇలా తన రీఎంట్రీపై క్లారిటీ ఇచ్చింది ఇషా చావ్లా. ప్రేమకావాలి సినిమాతో హీరోయిన్ గా పరిచయమైన ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం హిందీలో ఓ వెబ్ సిరీస్ చేస్తోంది. తెలుగులో 2, తమిళ్ లో మరో సినిమా చేస్తోంది. తను చేస్తున్న 2 తెలుగు సినిమాలు తనకు మంచి పేరు తెచ్చిపెడతాయంటోంది ఈ చిన్నది.