పుకార్లు ఖండించిన హాట్ హీరోయిన్

సాయేషా సైగల్ గుర్తుందా.. అఖిల్ హీరోగా నటించిన “అఖిల్” అనే సినిమాతో టాలీవుడ్ కు పరిచయమైంది. ఆ సినిమా డిజాస్టర్ అవ్వడంతో టాలీవుడ్ లో పెద్దగా ఆఫర్లు రాక కోలీవుడ్ కు చెక్కేసింది. ఏకంగా అక్కడి హీరో ఆర్యను పెళ్లి చేసుకొని లైఫ్ లో సెటిలైపోయింది. ఇప్పుడీ ముద్దుగుమ్మ మీద ఓ పుకారు రేగింది.

ప్రస్తుతం సాయేషా గర్భవతి అంటూ కోలీవుడ్ లో కొన్ని సైట్లు రాసుకొచ్చాయి. దీనికి సాక్ష్యాలుగా ఓ  నెల కిందట ఆమె పోస్ట్ చేసిన కొన్ని ఫొటోలు, వీడియోలు చూపించాయి. అందులో ఆమె వదులైన దుస్తులు వేసుకుంది. కాస్త నిదానంగా నడుస్తోంది. దాదాపు నెల రోజులుగా షికారు చేస్తున్న ఈ పుకారుపై సాయేషా క్లారిటీ ఇచ్చింది.

అందరిలా ఓ స్టేట్ మెంట్ ఇచ్చి వదిలేయలేదు ఈ ముద్దుగుమ్మ. పుకార్లను ఖండించడం కోసం ఏకంగా ఓ డాన్స్ వీడియో రిలీజ్ చేసింది. నడుము-పొట్ట కనిపించేలా బిగుతుగా ఉండే దుస్తులు ధరించింది, ఓ మంచి పాట పెట్టి దానికి తగ్గట్టు డాన్స్ చేసింది. ఈ డాన్స్ క్లిప్ తో తను గర్భవతిని కాదనే విషయాన్ని పరోక్షంగా ఖండించింది సాయేషా.