మరోసారి పవన్ సరసన

ఇప్పటికే పవన్ తో కలిసి కెమెరామెన్ గంగతో రాంబాబు అనే సినిమాలో నటించింది తమన్న. ఆ సినిమాలో తమన్న కెమెరామెన్ గంగ అనే పాత్ర పోషిస్తే.. రిపోర్టర్ రాంబాబుగా పవన్ కల్యాణ్ కనిపించాడు. ఇప్పుడీ జంట మరోసారి కలవబోతోంది. అది కూడా వకీల్ సాబ్ సినిమాతోనే.

అవును.. అన్నీ అనుకున్నట్టు జరిగితే వకీల్ సాబ్ సినిమాలో పవన్ సరసన మిల్కీబ్యూటీ మెరిసే ఛాన్స్ ఉంది. ఈ మేరకు ఇండస్ట్రీ నుంచి లీకులైతే వస్తున్నాయి. అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

నిజానికి ఈ సినిమాలో హీరోయిన్ పాత్ర చాలా చాలా చిన్నది. మహా అయితే 8-10 నిమిషాల నిడివి మాత్రమే ఉంటుంది. పైగా ఫ్లాష్ బ్యాక్ లో వచ్చే క్యారెక్టర్. ఈ పాత్ర కోసం ముందుగా శృతిహాసన్ ను అనుకున్నారు. కానీ ఆమె తప్పుకుంది. ఆ తర్వాత ఇలియానా పేరు వినిపించింది. ఇప్పుడు తమన్న పేరు చక్కర్లు కొడుతోంది.