Telugu Global
NEWS

పారిపోతుండగా కొల్లు రవీంద్ర అరెస్ట్

టీడీపీ మాజీ మంత్రి కొల్లు రవీంద్ర అరెస్ట్ అయ్యారు. వైసీపీ నేత మోకా భాస్కరరావు హత్య కేసులో ఏ-4గా ఉన్న కొల్లు రవీంద్రను అరెస్ట్ చేసేందుకు ఈయన ఇంటికి వెళ్లగా తప్పించుకుని పారిపోయారు. దాంతో పోలీసులు గాలింపు జరిపారు. చివరకు ఆయన విశాఖపట్నం పారిపోతున్నారని నిఘా వర్గాలు ఇచ్చిన సమాచారంతో పోలీసులు అప్రమత్తయ్యారు. తూర్పుగోదావరి జిల్లా తుని మండలంలోని సీతారామపురం వద్ద పోలీసులు వాహనాలను తనిఖీ చేస్తుండగా కొల్లు రవీంద్ర దొరికారు. దాంతో ఆయన్ను అరెస్ట్ చేశారు. […]

పారిపోతుండగా కొల్లు రవీంద్ర అరెస్ట్
X

టీడీపీ మాజీ మంత్రి కొల్లు రవీంద్ర అరెస్ట్ అయ్యారు. వైసీపీ నేత మోకా భాస్కరరావు హత్య కేసులో ఏ-4గా ఉన్న కొల్లు రవీంద్రను అరెస్ట్ చేసేందుకు ఈయన ఇంటికి వెళ్లగా తప్పించుకుని పారిపోయారు. దాంతో పోలీసులు గాలింపు జరిపారు. చివరకు ఆయన విశాఖపట్నం పారిపోతున్నారని నిఘా వర్గాలు ఇచ్చిన సమాచారంతో పోలీసులు అప్రమత్తయ్యారు. తూర్పుగోదావరి జిల్లా తుని మండలంలోని సీతారామపురం వద్ద పోలీసులు వాహనాలను తనిఖీ చేస్తుండగా కొల్లు రవీంద్ర దొరికారు. దాంతో ఆయన్ను అరెస్ట్ చేశారు.

మత్స్యకార సామాజికవర్గానికి చెందిన మోకా భాస్కర్‌రావును ఇటీవల హత్య చేశారు. ఈ హత్య కేసులో చింతా చిన్ని ప్రధాన నిందితుడిగా ఉన్నాడు. గతంలో కొల్లు రవీంద్ర, చింతా చిన్నిల అక్రమాలను ప్రశ్నించినందుకే మోకా భాస్కరరావును కొల్లు రవీంద్ర హత్య చేయించారని ఆయన కుటుంబసభ్యులు ఆరోపించారు.

కొల్లు రవీంద్రను అరెస్ట్ చేయాలంటూ మోకా భాస్కరరావు కుటుంబసభ్యులు ధర్నాకు కూడా దిగారు. దాంతో పోలీసులు వేగంగా కదిలారు. ఇప్పటికే అరెస్ట్‌ అయిన నిందితులు ఇచ్చిన సమాచారంతో పాటు… కాల్ డేటా, ఇతర సాంకేతిక ఆధారాల సాయంతో ఈ హత్య వెనుక కొల్లు రవీంద్ర హస్తం ఉన్నట్టు పోలీసులు గుర్తించారు.

రవీంద్ర ప్రోత్సాహంతో గత నెల 29న చిన్ని, చింతా నాంచారయ్య అలియాస్‌ పులి, చింతా కిషోర్‌ (మైనర్‌)లు చేపల మార్కెట్‌లో ఉన్న మోకాపై కత్తులతో దాడి చేసి పొడిచి చంపినట్టు పోలీసులు తేల్చారు. హత్య జరిగిన రోజు సాయంత్రమే ముగ్గురు నిందితులు పోలీసుల ముందు లొంగిపోయారు.

మోకా భాస్కరరావు హత్యలో టీడీపీ నేత, మాజీ మంత్రి కొల్లు రవీంద్ర ప్రోద్బలం ఉన్నట్లు నిందితుల వాంగ్మూలంతోపాటు కాల్‌డేటా, సాంకేతిక అంశాల ద్వారా నిర్దారణ అయిందని కృష్ణా జిల్లా ఎస్పీ రవీంద్రనాథ్‌బాబు వెల్లడించారు. అన్ని కోణాల్లో పరిశీలించిన తర్వాతే రవీంద్రపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేసినట్టు వివరించారు.

First Published:  3 July 2020 9:59 PM GMT
Next Story