మరో ఐటెంసాంగ్ లో పాయల్ రాజ్ పుత్

పాయల్ రాజ్ పుత్ కు ఐటెంసాంగ్స్ కొత్తకాదు. ఇప్పటికే సీత అనే సినిమాలో ఐటెంసాంగ్ చేసింది. ఆ పాటకు మంచి రెస్పాన్స్ కూడా వచ్చింది. కాకపోతే పాయల్ అందాలు ఆరబోసింది కానీ సరిగ్గా స్టెప్పులు వేయలేకపోయిందనే విమర్శను ఎదుర్కొంది. ఆ సంగతి పక్కనపెడితే, ఇప్పుడు పాయల్ కు మరో ఐటెంసాంగ్ ఆఫర్ వచ్చింది. ఈసారి వచ్చిన ఆఫర్ అలాంటిలాంటిది కాదు.

అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో పుష్ప అనే సినిమా రాబోతోంది. వీళ్లిద్దరి కాంబినేషన్ అంటే ఐటెంసాంగ్ ఉండాల్సిందే. ఈ ఐటెంసాంగ్ కోసం పాయల్ ను సంప్రదించినట్టు వార్తలు వస్తున్నాయి. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన రానుంది.

సుక్కూ సినిమాల్లో ఐటెంసాంగ్స్ అన్నీ హిట్. రీసెంట్ గా రంగస్థలం సినిమాలో ఐటెంసాంగ్ ను పూజా హెగ్డేతో చేయించాడు సుకుమార్. పుష్ప కోసం కూడా అదే విధంగా ఓ స్టార్ హీరోయిన్ ను తీసుకుంటాడని అంతా అనుకున్నారు. కానీ ఆ క్రేజీ ఆఫర్ పాయల్ ను వరించినట్టు వార్తలు వస్తున్నాయి.