మరో బుల్లితెర స్టార్ కు కరోనా

టెలివిజన్ నటీనటులు ఒక్కొక్కరిగా కరోనా బారిన పడుతున్నారు. మొన్నటికిమొన్న నటుడు ప్రభాకర్ కు పాజిటివ్ వచ్చింది. ఆ తర్వాత స్టార్ హీరోయిన్ నవ్య కరోనా బారిన పడింది. ఆ వెంటనే మరో సీరియల్ నటుడు బాలకృష్ణకు కరోనా సోకింది. ఇప్పుడు నటుడు రవికృష్ణ కూడా కరోనా బారిన పడ్డాడు

తనకు కరోనా సోకిన విషయాన్ని రవికృష్ణ స్వయంగా వెల్లడించాడు. 3 రోజుల నుంచి స్వీయ నిర్బంధంలో ఉన్నట్టు తెలిపాడు. తనతో రీసెంట్ గా టచ్ లోకి వచ్చిన వాళ్లంతా టెస్టులు చేయించుకోవాలని కోరాడు.

ఇంతకీ రవికృష్ణకు ఎలా కరోనా వచ్చిందో తెలుసా? కొన్ని రోజుల కిందట హీరోయిన్ నవ్యతో కలిసి ఓ సీరియల్ షూటింగ్ లో పాల్గొన్నాడు. అలా నవ్య ద్వారా రవికృష్ణకు వచ్చింది. అయితే ఈ విషయంలో తను ఎవ్వర్నీ నిందించనని, అంతా జాగ్రత్తగా ఉండాలని కోరుతున్నాడు ఈ నటుడు.

సీరియల్స్ తోనే కాకుండా.. బిగ్ బాస్ సీజన్-3తో కూడా రవికృష్ణ పాపులర్ అయ్యాడు. ఆ షోలో మంచి అబ్బాయి ఇమేజ్ తెచ్చుకున్నాడు. రవికృష్ణకు కరోనా సోకడంతో ఏకంగా 3 సీరియల్స్ షూటింగ్స్ ఆగిపోయాయి.