Telugu Global
National

చంద్రబాబు, కమ్యూనిస్టులకు బహుజన పరిరక్షణ వేదిక అల్టిమేటం

జనసేన, కమ్యూనిస్టు నేతలు రామకృష్ణ, నారాయణలను వెంటపెట్టుకుని చంద్రబాబునాయుడు చేస్తున్న రాజకీయంపై బహుజనపరిరక్షణ వేదిక మండిపడింది. అమరావతి ప్రాంతంలో వెనుకబడిన వర్గాలకు ఇళ్ల స్థలాలు అందకుండా చంద్రబాబునాయుడు, జనసేన, సీపీఐ, సీపీఎంలు అడ్డుపుడుతున్నాయని వేదిక నేతలు ఆరోపించారు . రాష్ట్ర వ్యాప్తంగా 30 లక్షలమందికి ఇళ్ల పట్టాలను ప్రభుత్వం అందజేస్తుంటే… విపక్షాలు చేసిన కుట్ర కారణంగా అమరావతిలోని పేదలు మాత్రం ఇళ్ల స్థలాలకు నోచుకోలేక కన్నీరు పెడుతున్నారని బహుజన పరిరక్షణ వేదిక నేతలు మండిపడ్డారు. అమరావతి ప్రాంతంలో […]

చంద్రబాబు, కమ్యూనిస్టులకు బహుజన పరిరక్షణ వేదిక అల్టిమేటం
X

జనసేన, కమ్యూనిస్టు నేతలు రామకృష్ణ, నారాయణలను వెంటపెట్టుకుని చంద్రబాబునాయుడు చేస్తున్న రాజకీయంపై బహుజనపరిరక్షణ వేదిక మండిపడింది. అమరావతి ప్రాంతంలో వెనుకబడిన వర్గాలకు ఇళ్ల స్థలాలు అందకుండా చంద్రబాబునాయుడు, జనసేన, సీపీఐ, సీపీఎంలు అడ్డుపుడుతున్నాయని వేదిక నేతలు ఆరోపించారు .

రాష్ట్ర వ్యాప్తంగా 30 లక్షలమందికి ఇళ్ల పట్టాలను ప్రభుత్వం అందజేస్తుంటే… విపక్షాలు చేసిన కుట్ర కారణంగా అమరావతిలోని పేదలు మాత్రం ఇళ్ల స్థలాలకు నోచుకోలేక కన్నీరు పెడుతున్నారని బహుజన పరిరక్షణ వేదిక నేతలు మండిపడ్డారు.

అమరావతి ప్రాంతంలో వెనుకబడిన వర్గాలకు 50వేల ఇళ్ల పట్టాలు ఇచ్చేందుకు ముఖ్యమంత్రి జగన్‌మోహన్ రెడ్డి నిర్ణయిస్తే… చంద్రబాబునాయుడు కోర్టులో పిల్ వేయించి ఇళ్ల స్థలాల పంపిణీని అడ్డుకున్నారని ఆరోపించారు. వెనుకబడిన వర్గాలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలంటూ కమ్యూనిస్టులు ఉద్యమాలు చేయడం చూశామని…. కానీ అమరావతిలో మాత్రం కమ్యూనిస్టు నాయకులు రామకృష్ణ, నారాయణ కూడా ఒక వర్గానికి కొమ్ముకాస్తున్నారని విమర్శించారు.

రాజధానిలో వెనుకబడిన వర్గాలు మగ్గిపోతుంటే… కొందరు మాత్రం కోట్లకు భూములు అమ్ముకుంటున్నారన్నారు. అమరావతిలో ఎస్సీఎస్టీబీసీ మైనార్టీలకు 50వేల ఇళ్ల పట్టాలిస్తుంటే టీడీపీ, జనసేన, కమ్యూనిస్టులకు వచ్చిన బాధేంటని ప్రశ్నించారు.

పేదలకు ఇంగ్లీష్, అమరావతిలో వెనుకబడిన వర్గాలకు ఇళ్లపట్టాలు, మూడు రాజధానులు ఇలా ప్రభుత్వం అన్ని వర్గాలకు మేలు చేసే ఏ నిర్ణయం తీసుకున్నా కోర్టులను అడ్డుపెట్టుకుని అడ్డుతగలడం చంద్రబాబుకు అలవాటుగా మారిందన్నారు. ఈ సందర్బంగా బహుజన పరిరక్షణ సమితి… టీడీపీ, జనసేన, సీపీఐ, సీపీఎం పార్టీల ముందు మూడు డిమాండ్‌లు ఉంచింది.

అమరావతిలో వెనుకబడిన వర్గాలకు 50వేల ఇళ్ల పట్టాల పంపిణీకి మద్దతు తెలిపి కోర్టులో వేసిన పిటిషన్‌ వెనక్కు తీసుకోవడంతోపాటు… ఇంగ్లీష్ మీడియం, మూడు రాజధానుల ఏర్పాటుకు విపక్షాలు మద్దతు తెలిపాలని డిమాండ్ చేశారు. పది రోజుల్లోగా విపక్షాలు ఈ మేరకు ప్రకటన విడుదల చేయకపోతే…. టీడీపీ, జనసేన, సీపీఐ, సీపీఎం కార్యాలయాలను వేలాది మందితో కలిసి ముట్టడిస్తామని బహుజన పరిరక్షణ వేదిక ప్రకటించింది. వెనుకబడిన వర్గాల ఉద్యమం ఎలా ఉంటుందో చూపిస్తామన్నారు.

First Published:  6 July 2020 1:54 AM GMT
Next Story