Telugu Global
International

భారతీయులకు కువైట్ షాక్

భారతీయులకు కువైట్ ప్రభుత్వం గట్టి షాక్ ఇచ్చింది. ప్రవాసీ కోటా డ్రాప్ట్‌ బిల్లుకు కువైట్ జాతీయ అసెంబ్లీ కమిటీ ఆమోదం తెలిపింది. ఈ బిల్లు పూర్తిస్థాయిలో అమలులోకి వస్తే కువైట్‌లోని దాదాపు 8 లక్షల మంది భారతీయులు వెనక్కు రావాల్సిన పరిస్థితి రానుంది. విదేశీ వర్కర్స్‌ సంఖ్య 30 శాతానికి తగ్గించేందుకు ఈ బిల్లును తీసుకొచ్చారు. ఈ బిల్లు ప్రకారం భారతీయల సంఖ్య అక్కడి జనాభాలో 15శాతానికి మించడానికి లేదు. ఈ లెక్కన 8లక్షల మంది భారతీయులు […]

భారతీయులకు కువైట్ షాక్
X

భారతీయులకు కువైట్ ప్రభుత్వం గట్టి షాక్ ఇచ్చింది. ప్రవాసీ కోటా డ్రాప్ట్‌ బిల్లుకు కువైట్ జాతీయ అసెంబ్లీ కమిటీ ఆమోదం తెలిపింది. ఈ బిల్లు పూర్తిస్థాయిలో అమలులోకి వస్తే కువైట్‌లోని దాదాపు 8 లక్షల మంది భారతీయులు వెనక్కు రావాల్సిన పరిస్థితి రానుంది. విదేశీ వర్కర్స్‌ సంఖ్య 30 శాతానికి తగ్గించేందుకు ఈ బిల్లును తీసుకొచ్చారు.

ఈ బిల్లు ప్రకారం భారతీయల సంఖ్య అక్కడి జనాభాలో 15శాతానికి మించడానికి లేదు. ఈ లెక్కన 8లక్షల మంది భారతీయులు బలవంతంగా కువైట్‌ నుంచి బయటకు రావాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రస్తుతం 70 శాతంగా ఉన్న ప్రవాసీలను 30 శాతానికి తగ్గించడానికి ఈ బిల్లు తెచ్చారు.

దాదాపు 43 లక్షల జనాభా ఉన్న కువైట్‌ దేశంలో వివిధ దేశాలకు చెందిన ప్రవాసీల సంఖ్య 30 లక్షల వరకు ఉంది. వీరిలో అత్యధికంగా 14 లక్షల మంది భారతీయులే ఉన్నారు. ఈ బిల్లు కారణంగా ఇప్పటికే అక్కడున్న 8 లక్షల మంది భారతీయులు బలవంతంగా వెనక్కు రావాల్సి ఉంటుంది. కువైట్‌ నుంచి విదేశీయులను వెనక్కు పంపించాలనే ఒత్తిడి స్థానిక అధికారులు, నాయకుల నుంచి ఎక్కువగా ఉంది.

First Published:  6 July 2020 4:41 AM GMT
Next Story