వర్మ ట్విట్టర్ ఆమెకు అంకితం

రామ్ గోపాల్ వర్మ ఈరోజు తన ట్విట్టర్ పేజీని ఓ అమ్మాయికి అంకితం చేశాడు. ఉదయం మొదలుపెడితే సాయంత్రం వరకు గంటకొక ఫొటో వదుల్తున్నాడు. ఆ అమ్మాయిని పొగడ్తల్లో ముంచెత్తుతున్నాడు. ఇంతకీ ఆ అమ్మాయి ఎవరో తెలుసా..? ఈ ముద్దుగుమ్మ పేరు అప్సర రాణి.

ఈ అమ్మాయిని తన నెక్ట్స్ సినిమాలో హీరోయిన్ గా పెట్టుకున్నాడు వర్మ. అందుకే ఆమె పరిచయ కార్యక్రమానికి ఈరోజు మొత్తాన్ని కేటాయించాడు. అప్సర సంగతుల్ని స్వయంగా వర్మ వెల్లడించాడు. తను తీస్తున్న థ్రిల్లర్ అనే సినిమాతో ఈమెను హీరోయిన్ గా పరిచయం చేస్తున్నాడు.

ఈ అమ్మాయి ఒరిస్సాలో పుట్టిందట. డెహ్రాడూన్ లో పెరిగిందట. హైదరాబాద్ లో సెటిలైందట. తన కోసం ఆకాశం నుంచి దిగి వచ్చిందట. ఇంత అందగెత్తను ఇన్నాళ్లూ మిస్సయ్యానంటూ ఫీలైపోతున్న వర్మ.. కచ్చితంగా ఈ అమ్మాయి ఆడియన్స్ కు థ్రిల్ ఇస్తుందని చెబుతున్నాడు.