‘మహాసముద్రం’ కోసం కొత్తపాట్లు….

మహాసముద్రం… దాదాపు ఏడాదిగా నలుగుతున్న ప్రాజెక్ట్ ఇది. నాగచైతన్య, రవితేజ, నితిన్.. ఇలా చాలామంది చుట్టూ తిరిగిన ఈ ప్రాజెక్టు ఎట్టకేలకు శర్వానంద్ దగ్గరకొచ్చి ఆగింది. ఇప్పుడు హీరోయిన్ విషయంలో కూడా ఈ సినిమా ఇలానే చక్కర్లు కొడుతోంది.

ముందుగా సమంతను అనుకున్నారు. ఆ తర్వాత అదితిరావు హైదరీ అనుకున్నారు. మధ్యలో రకుల్ పేరు కూడా వినిపించింది. ఫైనల్ గా ఆ ఛాన్స్ రాశిఖన్నాను వరించింది. అలా మహాసముద్రం సినిమా కోసం అటు శర్వానంద్, ఇటు రాశిఖన్నా ఫిక్స్ అయ్యారు.

అయితే ఈ సినిమాలో మరో హీరో, మరో హీరోయిన్ కూడా ఉన్నారు. ఆ రెండో హీరో పాత్ర కోసం సిద్దార్థ్ ను ఆల్ మోస్ట్ ఫిక్స్ చేశారు. సెకెండ్ హీరోయిన్ ఎవరనేది ఇంకా ఫిక్స్ అవ్వలేదు. ప్రణీతతో చర్చలు జరుపుతున్నట్టు టాక్. మరికొందరు మాత్రం పాయల్ పేరు చెబుతున్నారు.

మొత్తానికి దర్శకుడు అజయ్ భూపతికి హీరోహీరోయిన్లను వెదికి పట్టుకోవడానికే ఏడాది పట్టింది. సినిమా ఎప్పుడు సెట్స్ పైకి వస్తుందో చూడాలి.