Telugu Global
Cinema & Entertainment

మాకు స్టార్ హీరోయిన్ అక్కర్లేదు

బాలయ్య సినిమాలో హీరోయిన్ ఎవరనే టాపిక్ పై రోజుకో డిస్కషన్ నడుస్తోంది. తాజాగా అమలాపాల్ పేరు కూడా తెరపైకొచ్చింది. అయితే ఈ డిస్కషన్ ను కొట్టి పారేస్తున్నాడు బోయపాటి. బాలయ్య సినిమా కోసం ఓ కొత్త హీరోయిన్ ను తీసుకునే ఆలోచనలో ఉన్నామని ఇప్పటికే ప్రకటించిన బోయపాటి.. అదే మాటకు కట్టుబడి ఉన్నాడు. బాలయ్య సరసన క్రేజీ హీరోయిన్ కాకుండా, కొత్త హీరోయిన్ కనిపిస్తుందని క్లారిటీ ఇచ్చాడు. నిజానికి కొత్త హీరోయిన్ సెలక్షన్ ప్రాసెస్ కూడా పూర్తయింది. […]

మాకు స్టార్ హీరోయిన్ అక్కర్లేదు
X

బాలయ్య సినిమాలో హీరోయిన్ ఎవరనే టాపిక్ పై రోజుకో డిస్కషన్ నడుస్తోంది. తాజాగా అమలాపాల్ పేరు కూడా తెరపైకొచ్చింది. అయితే ఈ డిస్కషన్ ను కొట్టి పారేస్తున్నాడు బోయపాటి.

బాలయ్య సినిమా కోసం ఓ కొత్త హీరోయిన్ ను తీసుకునే ఆలోచనలో ఉన్నామని ఇప్పటికే ప్రకటించిన బోయపాటి.. అదే మాటకు కట్టుబడి ఉన్నాడు. బాలయ్య సరసన క్రేజీ హీరోయిన్ కాకుండా, కొత్త హీరోయిన్ కనిపిస్తుందని క్లారిటీ ఇచ్చాడు.

నిజానికి కొత్త హీరోయిన్ సెలక్షన్ ప్రాసెస్ కూడా పూర్తయింది. చాలా రోజుల కిందటే ఇద్దరు కొత్తమ్మాయిల్ని ఫైనల్ చేసి పెట్టారు. వాళ్లలోంచి ఒక్కర్ని ఫిక్స్ చేయాలి. కొత్త షెడ్యూల్ మొదలైన వెంటనే కొత్త హీరోయిన్ ను ఎనౌన్స్ చేస్తారు.

ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే ఓ షెడ్యూల్ పూర్తయింది. ఆమధ్య టీజర్ కూడా రిలీజ్ చేశారు. బాలయ్య-బోయపాటి కాంబోలో వస్తున్న హ్యాట్రిక్ మూవీ ఇది.

First Published:  7 July 2020 9:15 AM GMT
Next Story