Telugu Global
National

కరోనా విజృంభణ... టాప్ స్టేట్స్ ఇవే...

దేశంలో కరోనా అంతకంతకు విస్తరిస్తోంది. లాక్‌డౌన్‌ ఎత్తివేసిన తర్వాత పరిస్థితి అదుపు తప్పుతోంది. ప్రపంచంలోనే అత్యధిక కరోనా కేసులు నమోదైన దేశాల జాబితాలో భారత్‌ మూడో స్థానానికి చేరింది. త్వరలోనే రెండో స్థానాన్ని ఆక్రమించే సూచనలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం అమెరికాలో 30 లక్షల కేసులు నమోదు అయ్యాయి. రెండో స్థానంలో ఉన్న బ్రెజిల్‌లో 16లక్షలు దాటాయి. ఏడు లక్షల 19వేల కేసులతో భారత్‌ మూడో స్థానంలో ఉంది. నాలుగో స్థానంలో ఉన్న రష్యాలో ఆరు లక్షల 87వేల […]

కరోనా విజృంభణ... టాప్ స్టేట్స్ ఇవే...
X

దేశంలో కరోనా అంతకంతకు విస్తరిస్తోంది. లాక్‌డౌన్‌ ఎత్తివేసిన తర్వాత పరిస్థితి అదుపు తప్పుతోంది. ప్రపంచంలోనే అత్యధిక కరోనా కేసులు నమోదైన దేశాల జాబితాలో భారత్‌ మూడో స్థానానికి చేరింది. త్వరలోనే రెండో స్థానాన్ని ఆక్రమించే సూచనలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం అమెరికాలో 30 లక్షల కేసులు నమోదు అయ్యాయి. రెండో స్థానంలో ఉన్న బ్రెజిల్‌లో 16లక్షలు దాటాయి.

ఏడు లక్షల 19వేల కేసులతో భారత్‌ మూడో స్థానంలో ఉంది. నాలుగో స్థానంలో ఉన్న రష్యాలో ఆరు లక్షల 87వేల కరోనా కేసులు ఉన్నాయి. వైరస్‌ ఉధృతి ఇలాగే కొనసాగితే బ్రెజిల్‌ను భారత్ దాటేస్తుందని అంచనా వేస్తున్నారు. గడిచిన 24 గంటల్లోనే భారత్‌లో 24వేల 248 కరోనా కేసులు నమోదు అయ్యాయి. ఇప్పటి వరకు దేశంలో 19వేల 693 మంది మరణించారు.

మహారాష్ట్రలో 2.06 లక్షల కేసులు నమోదు అయ్యాయి. రెండో స్థానంలో తమిళనాడు ఉంది. తమిళనాడులో లక్షా 11వేల 151 కరోనా కేసులు నమోదు అయ్యాయి. మూడో స్థానంలో ఢిల్లీ ఉంది. దేశ రాజధానిలో 99వేల 444 కరోనా కేసులున్నాయి. నాలుగో స్థానంలో గుజరాత్ ఉంది. ప్రధాని సొంత రాష్ట్రంలో 36వేల 37 మంది కరోనా బారినపడ్డారు. ఉత్తరప్రదేశ్‌లో 27వేల 707 మంది, తెలంగాణలో 25వేల 700 మంది, కర్నాటకలో 23వేల మంది, బెంగాల్‌లో 22వేల మంది, రాజస్థాన్‌, ఆంధ్రప్రదేశ్‌ లలో 20వేల మంది కరోనా బారినపడ్డారు.

First Published:  6 July 2020 11:24 PM GMT
Next Story