Telugu Global
Cinema & Entertainment

నాగచైతన్య షూటింగ్ కు రెడీ

షూటింగ్స్ పర్మిషన్ ఇచ్చినప్పటికీ పెద్ద సినిమాలేవీ పట్టాలపైకి రాలేదు. రిస్క్ ఎందుకని అంతా ఇంట్లో కూర్చున్నారు. చిన్నాచితకా సినిమాలు మాత్రం సెట్స్ పైకొచ్చాయి. కాస్త రిస్క్ చేసి పనికానిస్తున్నారు వాళ్లంతా. పెద్ద సినిమాల విషయానికొస్తే, ఈ సెగ్మెంట్ లో అందరికంటే ముందుగా నాగచైతన్య చొరవ తీసుకునేలా కనిపిస్తున్నాడు. అవును.. తను చేస్తున్న లవ్ స్టోరీ సినిమాకు సంబంధించి ఆఖరి షెడ్యూల్ ను త్వరలోనే ప్రారంభించాలని ఫిక్స్ అయ్యాడు చైతూ. అన్నీ అనుకున్నట్టు జరిగితే వచ్చే నెల రెండో […]

నాగచైతన్య షూటింగ్ కు రెడీ
X

షూటింగ్స్ పర్మిషన్ ఇచ్చినప్పటికీ పెద్ద సినిమాలేవీ పట్టాలపైకి రాలేదు. రిస్క్ ఎందుకని అంతా ఇంట్లో కూర్చున్నారు. చిన్నాచితకా సినిమాలు మాత్రం సెట్స్ పైకొచ్చాయి. కాస్త రిస్క్ చేసి పనికానిస్తున్నారు వాళ్లంతా. పెద్ద సినిమాల విషయానికొస్తే, ఈ సెగ్మెంట్ లో అందరికంటే ముందుగా నాగచైతన్య చొరవ తీసుకునేలా కనిపిస్తున్నాడు.

అవును.. తను చేస్తున్న లవ్ స్టోరీ సినిమాకు సంబంధించి ఆఖరి షెడ్యూల్ ను త్వరలోనే ప్రారంభించాలని ఫిక్స్ అయ్యాడు చైతూ. అన్నీ అనుకున్నట్టు జరిగితే వచ్చే నెల రెండో వారం నుంచి లవ్ స్టోరీ ఫైనల్ షెడ్యూల్ మొదలవుతుంది. ఈ మేరకు రామోజీ ఫిలింసిటీలో ఓ సెట్ నిర్మిస్తున్నారు.

నిజానికి సెట్స్ పైకి రావడానికి తనకు ఎలాంటి అభ్యంతరం లేదని చాలారోజుల కిందట దర్శకుడు శేఖర్ కమ్ములకు చెప్పాడట నాగచైతన్య. కాకపోతే సాయిపల్లవితో కాంబినేషన్ సీన్స్ తీయాల్సి ఉంది. ఇప్పుడు ఆమె కూడా ఒప్పుకోవడంతో షూటింగ్ కు లైన్ క్లియర్ అయింది.

First Published:  7 July 2020 9:17 AM GMT
Next Story