మహబూబ్ నగర్ లో “పుష్ప”

ఇప్పట్లో కరోనా తగ్గేలా లేదు. ప్రభుత్వం అనుమతిచ్చినా షూటింగ్స్ మొదలయ్యేలా కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో “పుష్ప” ప్లాన్స్ కూడా మారిపోతున్నాయి. మొన్నటివరకు తూర్పుగోదావరి జిల్లా మారేడుమిల్లి అనుకున్నారు. కరోనాకు ముందే రెక్కీ కూడా పూర్తిచేశారు. కానీ ఇప్పుడు హైదరాబాద్ కు దగ్గర్లో ఉన్న మహబూబ్ నగర్ అటవీ ప్రాంతంలో సినిమాను షూట్ చేయాలని నిర్ణయించారు.

అవును.. పుష్ప సినిమాకు సంబంధించి కీలకమైన ఛేజింగ్ సన్నివేశాలన్నీ ఈ అటవీ ప్రాంతంలోనే పూర్తిచేయబోతున్నారు. నిజానికి ఇవే సన్నివేశాల్ని కేరళ అడవుల్లో తీయాలనుకున్నారు. తర్వాత మారేడుమిల్లి అనుకున్నారు. ఇప్పుడు మహబూబ్ నగర్ కు వచ్చారు. ఎర్రచందనం స్మగ్లింగ్ కాన్సెప్ట్ తో ఈ సినిమా వస్తున్న సంగతి తెలిసిందే.

అయితే ఇప్పుడు మనం చెప్పుకున్న షూటింగ్ వెంటనే స్టార్ట్ అవ్వదు. దీనికంటే ముందు రామోజీ ఫిలింసిటీలో ఓ షెడ్యూల్ మొదలవుతుంది. ఈ మేరకు ఫిలింసిటీలో సెట్ నిర్మాణం జోరుగా సాగుతోంది. అది కూడా అడవి సెట్టే. అందులో ఓ ఐటెంసాంగ్ తో పాటు కొన్ని సీన్స్ తీయాలని అనుకుంటున్నారు.