సచివాలయం కూల్చివేత ప్రారంభం… కొత్త నమూనా ఇదే

తెలంగాణ సచివాలయం కూల్చివేత పనులు ప్రారంభమయ్యాయి. సోమవారం అర్థరాత్రి నుంచే కూల్చివేత పనులు మొదలయ్యాయి. కూల్చివేతల నేపథ్యంలో వాహనాలను అటువైపు వెళ్లకుండా దారి మళ్లించారు. ఖైరతాబాద్, ట్యాంక్‌బండ్‌, మింట్ కాంపౌండ్ సెక్రెటరేట్ దారులను పోలీసులు మూసివేశారు.

ఈ భవనాలను 132 ఏళ్ల క్రితం నిర్మించారు. వీటిని నిజాం నవాబులు నిర్మించారు. వారి పాలనలో సైఫాబాద్ ప్యాలెస్‌ పేరుతో ప్రసిద్ది చెందాయి. నిజాంలు 25 ఎకరాల విస్తీర్ణంలో 10లక్షల చదరపు అడుగుల్లో సచివాలయ కట్టడాన్ని నిర్మించారు. అతిపురాతనమైన జీ బ్లాక్… 1888లో ఆరవ నిజాం నవాబు కాలంలో నిర్మించింది. 2003లో డీ బ్లాక్, 2012లో నార్త్, సౌత్ బ్లాక్‌లను ప్రభుత్వం ప్రారంభిచింది.

పాత సచివాలయాన్ని కూల్చివేసి అక్కడ నూతన సచివాలయం నిర్మించనున్నారు. 500 కోట్లతో కొత్త సచివాలయాన్ని నిర్మించేందుకు సిద్దమయ్యారు. కొత్త సచివాలయం నమూనాను కూడా ఖరారు చేశారు. ముఖ్యమంత్రి కార్యాలయం కొత్త సచివాలయం నమూనాను విడుదల చేసింది.