Telugu Global
National

కేసీఆర్ ఆరోగ్య పరిస్థితి చెప్పాలని హైకోర్టులో పిటిషన్

తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఎక్కడున్నారో.. ఆయన ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందో చెప్పాలని హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, హోం శాఖ ముఖ్య కార్యదర్శి, వైద్యారోగ్య శాఖ ప్రత్యేక కార్యదర్శులను ప్రతివాదులుగా చేరుస్తూ నవీన్ కుమార్ అలియాస్ తీన్మార్ మల్లన్న హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ముఖ్యమంత్రి అధికార నివాసమైన ప్రగతి భవన్‌లో 30 మంది సిబ్బందికి కరోనా పాజిటివ్ వచ్చిందని.. ఈ నేపథ్యంలో ఆయన ఫామ్‌హౌస్‌కు […]

కేసీఆర్ ఆరోగ్య పరిస్థితి చెప్పాలని హైకోర్టులో పిటిషన్
X

తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఎక్కడున్నారో.. ఆయన ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందో చెప్పాలని హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, హోం శాఖ ముఖ్య కార్యదర్శి, వైద్యారోగ్య శాఖ ప్రత్యేక కార్యదర్శులను ప్రతివాదులుగా చేరుస్తూ నవీన్ కుమార్ అలియాస్ తీన్మార్ మల్లన్న హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

ముఖ్యమంత్రి అధికార నివాసమైన ప్రగతి భవన్‌లో 30 మంది సిబ్బందికి కరోనా పాజిటివ్ వచ్చిందని.. ఈ నేపథ్యంలో ఆయన ఫామ్‌హౌస్‌కు వెళ్లిపోయినట్లు పత్రికల్లో, టీవీల్లో వార్తలు చూసి ప్రజలు తీవ్ర ఆందోళన చెందుతున్నారని.. వెంటనే ఆయన ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందో తెలియజేయాలని ఆ పిటిషన్‌లో కోరారు.

ఇటీవల హరితహారం కార్యక్రమంలో కేసీఆర్ మాస్కు లేకుండా పాల్గొన్నారని… ఆ తర్వాత జూన్ 28న సీఎం పీవీ శతజయంతి ఉత్సవాల ప్రారంభం రోజు ప్రజలకు కన్పించారని… అప్పుడు కూడా మాస్కు లేదని, ఆయన వెంట 100 మంది ప్రజా ప్రతినిధులు, ప్రజలు కనిపించారని…. ఇంత మందితో కలిసి తిరగడం, ఆ తర్వాత గత పది రోజులుగా కనిపించకుండా పోవడం తీవ్ర ఆందోళన కలిగిస్తుందని పిటిషనర్ పేర్కొన్నారు.

రాష్ట్ర ప్రభుత్వ అధినేతగా ఆయన అనేక కీలక కార్యక్రమాలు నిర్వహించాల్సి ఉందని… ప్రజలను ఆందోళన చెందకుండా ఆయన ఆచూకీ తెలియజేయడం ప్రభుత్వ బాధ్యతని ఆయన పిటిషన్‌లో కోరారు.

First Published:  8 July 2020 6:06 AM GMT
Next Story