ఈ పుకారు భలే ఇంట్రెస్టింగ్ గా ఉంది…

కొన్ని పుకార్లు వినడానికి భలేగా అనిపిస్తాయి. అవి కార్యరూపం దాలుస్తాయా లేక రూమర్లుగానే మిగిలిపోతాయా అనే విషయాన్ని పక్కనపెడితే.. ఆ టైమ్ కు మాత్రం అవి భలే థ్రిల్ అందిస్తాయి. ఇప్పుడు మనం చెప్పుకోబోయే గాసిప్ కూడా అలాంటిదే.

త్వరలోనే సుజీత్ దర్శకత్వంలో లూసిఫర్ రీమేక్ చేయబోతున్నాడు చిరంజీవి. ఇందులో ఓ కీలకమైన పాత్ర ఉంది. మలయాళంలో ఈ క్యారెక్టర్ ను పృధ్వీరాజ్ పోషించాడు. మోహన్ లాల్ కు సహాయం చేసే పాత్ర అది. తెలుగులో ఆ పాత్రను విజయ్ దేవరకొండతో చేయించాలని చూస్తున్నారట. ఈ మేరకు చర్చలు మొదలయ్యాయని చెబుతున్నారు.

చిరంజీవి, విజయ్ దేవరకొండ కాంబినేషన్.. వినడానికే కాస్త గమ్మత్తుగా ఉంది. నిజానికి ఇది అసాధ్యమయ్యే మేటర్ కూడా కాదు. చిరంజీవి ఒక్క ఫోన్ కొడితే దేవరకొండ సెట్స్ పైకి వచ్చి వాలిపోతాడు. కానీ ఒకటే అడ్డంకి.

దేవరకొండకు సోలో మార్కెట్ ఇప్పుడు చాలా పెద్దది. ఆచితూచి సినిమాలు చేస్తున్నాడు. ఇలాంటి టైమ్ లో చిరంజీవి సినిమాలో గెస్ట్ రోల్ టైపులో ఉండే ఆ చిన్న పాత్రను అతడు చేస్తాడా అనేది డౌట్. ఒకవేళ విజయ్ దేవరకొండ ఒప్పుకున్నప్పటికీ, చేజేతులా చిరంజీవి అతడి మార్కెట్ ను దెబ్బతీస్తాడని ఎవ్వరూ అనుకోరు. సో.. ప్రస్తుతానికి ఇది పుకారే.