మరో ఛాలెంజింగ్ పాత్రలో సూర్య

మరో ఛాలెంజింగ్ రోల్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు సూర్య. వెట్రిమారన్ దర్శకత్వంలో చేయబోయే సినిమాలో ఇతడి పాత్ర ఏంటనేది బయటకొచ్చింది. ఈ సినిమాలో జల్లికట్టు యోధుడిగా సూర్య కనిపించబోతున్నాడు. తమిళనాడు సంప్రదాయ క్రీడ ఇది. ఎంతో వివాదాస్పదమైన సంప్రదాయం కూడా ఇది. ఇలాంటి కాంట్రవర్సీ సబ్జెక్ట్ లో నటించడానికి ఓకే చెప్పాడు సూర్య.

ఈ సినిమాలో మరో ప్రత్యేకత కూడా ఉంది. ఇందులో సూర్య ద్విపాత్రాభినయం చేయబోతున్నాడు. ఒకే సినిమాలో తండ్రికొడుకు పాత్రల్లో కనిపించబోతున్నాడు. నిజానికి ఇలా తండ్రికొడుకుగా కనిపించడం సూర్యకు కొత్తకాదు. గతంలో సూర్య సన్నాఫ్ కృష్ణన్, 24 సినిమాల్లో ఇలాంటి పాత్రల్లో కనిపించి మెప్పించాడు. ఇప్పుడు మరోసారి అదే తరహా పాత్రలో కనిపించబోతున్నాడు.

ప్రస్తుతం ఆకాశం నీ హద్దురా అనే సినిమా చేస్తున్నాడు సూర్య. ఈ మూవీ విడుదలకు సిద్ధమైంది. ఈ సినిమా ప్రమోషన్ పూర్తయిన వెంటనే, వెట్రిమారన్ దర్శకత్వంలో సినిమా స్టార్ట్ చేస్తాడు సూర్య.