పవన్ సినిమాపై హైపర్ ఆది క్లారిటీ

పవన్ కల్యాణ్ రీఎంట్రీ మూవీ వకీల్ సాబ్ లో ఓ చిన్న కామెడీ పాత్రను ఆయన హార్డ్ కోర్ ఫ్యాన్ హైపర్ ఆది చేస్తున్నాడనే ప్రచారం చాన్నాళ్లుగా ఉంది. అయితే ఈ ప్రచారాన్ని హైపర్ ఆది ఖండిస్తున్నాడు.

పవన్ రీఎంట్రీ మూవీ వకీల్ సాబ్ లో తను లేనంటున్నాడు హైపర్ ఆది. తనను పవన్ కల్యాణ్ రిఫర్ చేయలేదని, రిఫరెన్స్ ఇవ్వాల్సిన అవసరం కూడా లేదన్నారు ఆది. అయితే సినిమాలో తను లేకపోయినా, ఆ మూవీ అప్ డేట్స్ ను ఎప్పటికప్పుడు కనుక్కుంటున్నానని, వకీల్ సాబ్ సినిమా అదిరిపోయే రేంజ్ లో వస్తోందని అంటున్నాడు ఈ హాస్యనటుడు.

ఓ వైపు జబర్దస్త్ లో స్కిట్స్ చేస్తూనే, మరోవైపు సినిమాల్లో నటిస్తున్నాడు హైపర్ ఆది. అఖిల్ హీరోగా నటిస్తున్న ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ సినిమాలో లెంగ్తీ రోల్ చేస్తున్నాడు. ఇక సాయితేజ్ నటించిన ‘సోలో బ్రతుకే సో బెటర్’ సినిమాలో కూడా తన పాత్ర చిన్నదే అయినప్పటికీ చాలా బాగుంటుందని చెబుతున్నాడు