Telugu Global
National

హైదరాబాద్‌లో పరిస్థితి ఆందోళనకరం... ఢిల్లీ, ఏపీని ఫాలో అవండి...

హైదరాబాద్‌లో కరోనా పరిస్థితి ఆందోళనకరంగా ఉందన్నారు కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్‌ రెడ్డి. ఢిల్లీలో కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్థన్‌ను కలిసి తెలంగాణలో పరిస్థితిని కిషన్ రెడ్డి వివరించారు. తెలంగాణలో కరోనా టెస్టులు పెంచేలా ఆదేశాలివ్వాలని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రిని కోరారు. హైదరాబాద్‌తో పాటు చుట్టు పక్కల జిల్లాల్లోనూ కరోనా కేసులు పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తోందన్నారు. తెలంగాణలో పరిస్థితిని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రికి వివరించానని… రాష్ట్ర ప్రభుత్వానికి అన్ని విధాలుగా సాయం చేసేందుకు సిద్ధంగా ఉన్నట్టు […]

హైదరాబాద్‌లో పరిస్థితి ఆందోళనకరం... ఢిల్లీ, ఏపీని ఫాలో అవండి...
X

హైదరాబాద్‌లో కరోనా పరిస్థితి ఆందోళనకరంగా ఉందన్నారు కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్‌ రెడ్డి. ఢిల్లీలో కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్థన్‌ను కలిసి తెలంగాణలో పరిస్థితిని కిషన్ రెడ్డి వివరించారు. తెలంగాణలో కరోనా టెస్టులు పెంచేలా ఆదేశాలివ్వాలని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రిని కోరారు.

హైదరాబాద్‌తో పాటు చుట్టు పక్కల జిల్లాల్లోనూ కరోనా కేసులు పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తోందన్నారు. తెలంగాణలో పరిస్థితిని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రికి వివరించానని… రాష్ట్ర ప్రభుత్వానికి అన్ని విధాలుగా సాయం చేసేందుకు సిద్ధంగా ఉన్నట్టు ఆయన చెప్పారని కిషన్ రెడ్డి వివరించారు.

హైదరాబాద్‌లో పరిస్థితి ఆందోళనకరంగా మారిందని… ఈ సమయంలో ఆంధ్రప్రదేశ్‌, ఢిల్లీ, తమిళనాడు తరహాలో భారీగా కరోనా పరీక్షలు చేసుకుంటూ వెళ్తేనే కరోనాను నియంత్రించడం సాధ్యమవుతుందని కిషన్ రెడ్డి అభిప్రాయపడ్డారు. ఇప్పటికే హైదరాబాద్‌లో అత్యంత వేగంగా కరనా వైరస్‌ విస్తరిస్తోంది.

కేంద్ర ప్రభుత్వం వెంటిలేటర్స్‌ను పంపించినా వాటిని ఉపయోగించుకోలేని పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం ఉందని… అందుకే ప్రజలు ప్రైవేట్ ఆస్పత్రులకు వెళ్తున్నారని కిషన్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఇప్పటికైనా కేసీఆర్‌ స్పందించాలని… యుద్దప్రాతిపదికన పరీక్షలు పెంచేందుకు చర్యలు తీసుకోవాలని కిషన్ రెడ్డి విజ్ఞప్తి చేశారు.

First Published:  8 July 2020 9:07 PM GMT
Next Story