పాయల్ కు ఇష్టమైన దర్శకుడు ఇతడే

హీరో విజయ్ దేవరకొండ అంటే ఇష్టమని ఇప్పటికే ప్రకటించింది హీరోయిన్ పాయల్. కుదిరితే దేవరకొండ సరసన ఓ సినిమా చేయాలని ఉందని కూడా మనసులో మాట బయటపెట్టింది. ఇప్పుడీ ముద్దుగుమ్మ తనకు ఇష్టమైన దర్శకుడి పేరు కూడా బయటపెట్టింది. అతడు మరెవరో కాదు.. విజయ్ దేవరకొండకు స్టార్ డమ్ తెచ్చిపెట్టిన అర్జున్ రెడ్డి సినిమా దర్శకుడు సందీప్ రెడ్డి వంగ.

తన ఫేవరెట్ దర్శకుడు సందీప్ రెడ్డి అనే విషయాన్ని బయటపెట్టింది పాయల్. ఆయన దర్శకత్వంలో సినిమా చేయాలనే కోరికను వెల్లడించింది. మొత్తమ్మీద అర్జున్ రెడ్డి కాంబినేషన్ మరోసారి రిపీట్ అయితే, అందులో తనను హీరోయిన్ గా తీసుకోమని పరోక్షంగా తన కోరిక బయటపెట్టింది పాయల్ రాజ్ పుత్.

తెలుగులో ఈ ముద్దుగుమ్మ పెద్దగా సక్సెస్ కాలేదు. ఆర్ఎక్స్100 ఇచ్చిన సక్సెస్ ను క్యాష్ చేసుకోవడంలో ఈమె పూర్తిగా ఫెయిలైంది. తర్వాత ఐటెంసాంగ్ కూడా చేసింది. లాక్ డౌన్ తర్వాత పాయల్ కెరీర్ ఎలా ఉంటుందనేది ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం ఆమె చేతిలో ఒకే ఒక్క తెలుగు సినిమా ఉంది.