Telugu Global
National

అరెస్ట్‌ భయం... ముందస్తు బెయిల్‌ కోసం పితాని కుమారుడు

ఈఎస్‌ఐ కుంభకోణంలో మరిన్ని అరెస్టులు ఉంటాయన్న ప్రచారం నేపథ్యంలో మాజీ మంత్రి పితాని సత్యనారాయణ కుమారుడు హైకోర్టును ఆశ్రయించారు. తనను ఏసీబీ అరెస్ట్ చేయకుండా ముందస్తు బెయిల్ ఇవ్వాలని కోరారు. పిటిషన్‌పై నిర్ణయాన్ని హైకోర్టు వాయిదా వేసింది. పితాని సురేష్‌తో పాటు మాజీ మంత్రి పితాని వద్ద పీఎస్‌గా పనిచేసిన మురళీమోహన్ కూడా హైకోర్టును ఆశ్రయించారు. అచ్చెన్నాయుడు తర్వాత కార్మిక శాఖ మంత్రిగా వచ్చిన పితాని సత్యనారాయణ ఇష్టానికి కాంట్రాక్టర్లకు చెల్లింపులు జరిపారన్న అభియోగాలున్నాయి. ఈఎస్ఐ నిబంధనల […]

అరెస్ట్‌ భయం... ముందస్తు బెయిల్‌ కోసం పితాని కుమారుడు
X

ఈఎస్‌ఐ కుంభకోణంలో మరిన్ని అరెస్టులు ఉంటాయన్న ప్రచారం నేపథ్యంలో మాజీ మంత్రి పితాని సత్యనారాయణ కుమారుడు హైకోర్టును ఆశ్రయించారు. తనను ఏసీబీ అరెస్ట్ చేయకుండా ముందస్తు బెయిల్ ఇవ్వాలని కోరారు. పిటిషన్‌పై నిర్ణయాన్ని హైకోర్టు వాయిదా వేసింది. పితాని సురేష్‌తో పాటు మాజీ మంత్రి పితాని వద్ద పీఎస్‌గా పనిచేసిన మురళీమోహన్ కూడా హైకోర్టును ఆశ్రయించారు.

అచ్చెన్నాయుడు తర్వాత కార్మిక శాఖ మంత్రిగా వచ్చిన పితాని సత్యనారాయణ ఇష్టానికి కాంట్రాక్టర్లకు చెల్లింపులు జరిపారన్న అభియోగాలున్నాయి. ఈఎస్ఐ నిబంధనల ప్రకారం ముందుగా మందులు సరఫరా చేసిన వారికి చెల్లింపులు చేయాలి. కానీ పితాని మంత్రి అయిన తర్వాత పాత మెమోను నిలుపుదల చేసి 2018 ఫిబ్రవరిలో కొత్త మెమో జారీ చేశారు. ఈ కొత్త మెమో ద్వారా ముందుగా మందులు సరఫరా చేసిన వారికి కాకుండా… తనకు నచ్చిన వారికి, తమకు కమిషన్లు ఇచ్చిన వారికి డబ్బులు చెల్లించారన్న ఆరోపణలు పితానిపై ఉన్నాయి.

పితాని సత్యనారాయణ కుమారుడు సురేష్ చిన్న కాగితం రాసిస్తే… ఆ కాగితం తీసుకొచ్చిన వారికే మందుల ఆర్డర్ ఇచ్చినట్టు గుర్తించారు. పితాని కుమారుడి ప్రమేయంపై ఇప్పటికే ఏసీబీ పలు ఆధారాలు సేకరించినట్టు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో పితాని సురేష్ ముందస్తు బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించారు.

First Published:  9 July 2020 9:35 AM GMT
Next Story