ప్రభాస్ సినిమాకు టైటిల్ ఫిక్స్

అంతా ఊహించినట్టే జరిగింది. ప్రభాస్ సినిమాకు రాధేశ్యామ్ అనే టైటిల్ నే ఫిక్స్ చేశారు. గత కొన్ని రోజులుగా అభిమానులు ట్రెండింగ్ చేస్తున్న ఈ టైటిల్ తోనే కొద్దిసేపటి కిందట ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు మేకర్స్.

నిజానికి ఈ సినిమాకు జాన్ లేదా రాధేశ్యామ్ అనే టైటిల్ పెట్టాలనుకున్నారు. యూవీ క్రియేషన్స్ బ్యానర్ పై ఆ రెండు టైటిల్స్ ను రిజిస్టర్ చేయించారు. కానీ అంతలోనే దిల్ రాజు జాను పేరిట ఓ సినిమా రిలీజ్ చేశాడు. దీంతో మిగిలిన రాధేశ్యామ్ టైటిల్ కే యూనిట్ ఫిక్స్ అవ్వాల్సి వచ్చింది.

ఇక ఫస్ట్ లుక్ విషయానికొస్తే.. సినిమా కథ, కాన్సెప్ట్ కు తగ్గట్టు కళాత్మకంగా ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. ప్ర‌భాస్‌, పూజాహెగ్డే ల‌తో బార్బిడాల్ డాన్స్ పోజ్ తో రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ చాలా ల‌వ్‌లీ గా వుండ‌టం అంద‌ర్ని ఆక‌ట్టుకుంది.

ముఖ్యంగా ప్ర‌భాస్‌, పూజా ఇద్ద‌రూ ప్రేమ‌కి ప్ర‌తిరూపంగా వుండ‌టం.. ఎర్ర‌టి స‌ముద్రాన్ని గౌనుగా వాడ‌టం ద‌ర్శ‌కుడి క్రియేటివిటి క‌నిపిస్తుంది. ప్రేమ‌ని చూపిస్తూ దాని వెన‌క స‌మ‌స్య‌ని ఈ పిక్చ‌ర్ లో చూపించారు.