మొన్న చంద్రబాబు… ఈసారి పవన్ కల్యాణ్

మొన్నటికి మొన్న చంద్రబాబుని టార్గెట్ చేస్తూ లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా తీశాడు రామ్ గోపాల్ వర్మ. ఇప్పుడీ దర్శకుడు పవన్ కల్యాణ్ ను టార్గెట్ చేశాడు. పవర్ స్టార్ అనే టైటిల్ తో సినిమా తీయబోతున్నట్టు కొన్ని రోజుల కిందట ప్రకటించిన ఈ డైరక్టర్, వెంటనే ఫస్ట్ లుక్ కూడా రిలీజ్ చేశాడు.

పవర్ స్టార్ ఫస్ట్ లుక్ లో రెండు పదాల మధ్య గాజు గ్లాస్ ను ఉంచాడు వర్మ. పవన్ ఎన్నికల గుర్తు అదే. ఇక ఈ సినిమాకు ఎన్నికల ఫలితాల తర్వాత కథగా చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు. కేవలం పాలిటిక్స్ కే పరిమితం కాకుండా.. ఇందులో పవన్ సినిమాల్ని కూడా మిక్స్ చేస్తున్నాడు.

ఫస్ట్ లుక్ తో పాటు వర్మ విడుదల చేసిన స్టిల్స్ లో పవన్ తో పాటు చిరంజీవి, త్రివిక్రమ్ పాత్రధారులు కూడా కనిపిస్తున్నారు. అంతేకాదు.. చీర కట్టుకున్న రష్యన్ అమ్మాయి కూడా ఈ సినిమాలో ఓ కీలక పాత్ర పోషిస్తోందంటున్నాడు వర్మ.

మొత్తమ్మీద పవర్ స్టార్ సినిమాతో వర్మ ఈసారి మరింత వివాదాన్ని రాజేసేలా ఉన్నాడు.