పితాని సురేష్‌ కోసం పోలీసుల వేట

ఈఎస్‌ఐ కుంభకోణంలో మాజీ మంత్రి పితాని సత్యనారాయణ కుమారుడు వెంకట సురేష్‌ కోసం పోలీసు బృందాలు గాలిస్తున్నాయి. సురేష్ హైదరాబాద్‌లో తలదాచుకున్నారన్న సమాచారంతో పోలీసులు అక్కడ సెర్చ్ ఆపరేషన్ చేస్తున్నారు.

ముందస్తు బెయిల్‌ కోసం హైకోర్టులో పిటిషన్ వేసిన సురేష్ , కోర్టు ఆదేశాలు వచ్చే వరకు పోలీసులకు చిక్కకూడదన్న ఉద్దేశంతోనే పారిపోయినట్టు భావిస్తున్నారు.

ఇప్పటికే అరెస్ట్ అయిన నిందితులు నాటి కార్మిక శాఖ మంత్రి పితాని కుమారుడు వెంకట సురేష్ ఒత్తిడి వల్లే కొన్ని కంపెనీలకు మందుల కొనుగోలు ఆర్డర్లు ఇచ్చినట్టు వెల్లడించారు. దాంతో అరెస్ట్ తప్పదని భావించిన పితాని సురేష్, పితాని సత్యనారాయణ వద్ద పీఎస్‌గా పనిచేసిన మురళీమోహన్ ముందస్తు బెయిల్ కోసం కోర్టును ఆశ్రయించారు. కోర్టు నిర్ణయం చెప్పాల్సి ఉంది. ఇంతలోనే నిన్న సచివాలయంలోనే మురళీమోహన్ ను ఏసీబీ అరెస్ట్ చేసింది. పితాని సురేష్ కోసం హైదరాబాద్‌లో గాలిస్తున్నారు.