బిగ్ బాస్ హౌజ్ లోకి వర్మ హీరోయిన్

పదేళ్ల నుంచి ఇండస్ట్రీలో ఉంది. కానీ ఎప్పుడూ రాని గుర్తింపు, 22 నిమిషాల షార్ట్ ఫిలిమ్ తో వచ్చింది. ఆ షార్ట్ ఫిలిం పేరు “నగ్నం”. ఆ హీరోయిన్ పేరు స్వీటీ అలియాస్ శ్రీ రాపాక. ఈ సినిమాతో లైమ్ లైట్లోకి వచ్చిన ఈ ఆంధ్రా అందగత్తె.. ఇప్పుడు ఏకంగా బిగ్ బాస్ నిర్వహకుల కంట్లో పడినట్టు తెలుస్తోంది.

ఈసారి హౌజ్ కు హాట్ నెస్ జోడించాలని స్టార్ మా యాజమాన్యం ఇప్పటికే ఫిక్స్ అయింది. ఇందులో భాగంగా ఫిమేల్ కంటెస్టెంట్స్ వేటను ముమ్మరం చేసింది. మొన్నటివరకు ఈ లిస్ట్ లో హంసానందిని, శ్రద్ధాదాస్, పూజిత పొన్నాడ, పూనమ్ బజ్వా లాంటి పేర్లు వినిపించాయి. ఇప్పుడు వీళ్లతో పాటు శ్రీ రాపాక పేరును కూడా పరిశీలిస్తున్నారట నిర్వహకులు.

సోషల్ మీడియాలో ఈమె తాజా సెన్సేషన్. ఈమె ఇంటర్వ్యూలు, ఫొటోలకు లక్షల్లో క్లిక్కులు వస్తున్నాయి. పైగా రెమ్యూనరేషన్ విషయంలో కూడా ఈమె అందుబాటులోనే ఉంది. దీంతో ఫైనల్ లిస్ట్ లో స్వీటీ ఉండే అవకాశాలు కాస్త ఎక్కువగా ఉన్నాయంటున్నారు బిగ్ బాస్ ఫ్యాన్స్.