మరో రీమేక్ చేయబోతున్న విశ్వక్ సేన్

రీసెంట్ గా కెరీర్ స్టార్ట్ చేశాడు విశ్వక్ సేన్. చేసిన 2-3 సినిమాల్లోనే ఆల్రెడీ ఓ రీమేక్ ఉంది. ఇప్పుడీ హీరో మరో రీమేక్ ను సెట్స్ పైకి తీసుకురాబోతున్నాడు. అవును.. అన్నీ అనుకున్నట్టు జరిగితే కప్పెళ అనే మలయాళ సినిమా రీమేక్ లో హీరోగా నటించబోతున్నాడు విశ్వక్ సేన్.

కేరళలో రీసెంట్ గా వచ్చిన సినిమాల్లో పెద్ద హిట్టయింది కప్పెళ మూవీ. పైగా ఈ సినిమా తెలుగు నేటివిటీకి సరిగ్గా సరిపోతుంది. అందుకే ఈ మూవీ రైట్స్ ను దక్కించుకుంది సితార ఎంటర్ టైన్ మెంట్స్ సంస్థ. ఇందులో హీరోగా విశ్వక్ సేన్ అయితే బాగుంటుందని అతడ్ని సంప్రదించింది.

కప్పెళ మూవీని ఓటీటీలో చూసిన విశ్వక్ సేన్.. ఈ సినిమాను రీమేక్ చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. అయితే ఎవరి దర్శకత్వంలో ఈ సినిమా రాబోతోందనేది ప్రస్తుతానికి సస్పెన్స్.

ప్రస్తుతం విశ్వక్ సేన్ ‘పాగల్’ అనే సినిమా చేస్తున్నాడు. దీంతో పాటు హిట్ సీక్వెల్ కూడా రెడీగా ఉంది. ‘పాగల్’ సినిమా కంప్లీట్ అయిన తర్వాత ‘కప్పెళ’ రీమేక్ పై క్లారిటీ రానుంది.