బాలీవుడ్‌కు బిగ్‌ షాక్…. బిగ్ బీ ఫ్యామిలీని తాకిన కరోనా

బాలీవుడ్‌ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. బిగ్ బీ అమితాబ్ బచ్చన్ కు కరోనా పాజిటివ్ వచ్చింది. ఈ విషయాన్ని అమితాబ్ స్వయంగా ట్వీట్ చేశారు.

‘T 3590 – నాకు కోవిడ్ పాజిటివ్ వచ్చినట్లు పరీక్షలో తేలింది. ఆసుపత్రికి తరలించారు. నా కుటుంబ సభ్యులతో పాటు సిబ్బంది కూడా పరీక్షలు చేయించుకున్నారు, ఇంకా ఫలితాలు రావాల్సి ఉంది. గత 10 రోజులలో నాకు దగ్గరగా ఉన్న వారందరూ దయచేసి తమను తాము పరీక్షించుకోవాలని అభ్యర్థిస్తున్నాను’ అంటూ అమితాబ్ ట్వీట్ చేశారు.

బాలీవుడ్‌ సెలబ్రెటీల్లో ఇంతవరకూ పెద్దగా స్టార్లకు కరోనా పాజిటివ్‌ రాలేదు. ఒక్కసారిగా బిగ్‌బీకి రావడంతో సినీ పరిశ్రమ ఉలిక్కిపడింది. ఆయన త్వరగా కోలుకోవాలని ట్విట్టర్‌లో ప్రముఖులు ట్వీట్‌ చేశారు. అమితాబ్… మీరు తొందరగా కోలుకుని రావాలంటూ ట్వీట్‌ చేశారు.

అయితే బిగ్‌బీకి మైల్డ్‌ సింటమ్స్‌ ఉన్నాయని… ఆయనకు ప్రస్తుతం వెంటిలేటర్‌ అవసరం లేదని డాక్టర్లు చెప్పారు.

అమితాబ్‌తో పాటు ఆయన తనయుడు అభిషేక్‌ బచ్చన్‌కు కూడా కరోనా పాజిటివ్ గా తేలింది. దీంతో ఆయన కూడా ఐసోలేషన్‌లోకి వెళ్లాడు.

ఇటు బాలీవుడ్‌ నటి రేఖా బంగ్లాలో సెక్యూరిటీ గార్డ్‌కు కరోనా సోకింది. దీంతో రేఖా బంగ్లాను ముంబై కార్పొరేషన్‌ సీజ్‌ చేసింది.