అమితాబ్ కు ఎలా కరోనా సోకింది

బిగ్ బి అమితాబ్ బచ్చన్ కు కరోనా సోకిందనే విషయం తెలిసిన వెంటనే బాలీవుడ్ ఒక్కసారిగా షాక్ అయింది. ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్న అమితాబ్ ను కూడా కరోనా విడిచిపెట్టకపోవడంతో అంతా ఆశ్చర్యానికి గురయ్యారు. అసలు బిగ్ బికి ఎలా కరోనా సోకిందనే చర్చ ఇప్పుడు ఎక్కువైంది. అమితాబ్ చేసిన ఒకే ఒక్క పని వల్ల అతడికి వైరస్ సోకి ఉంటుందని భావిస్తున్నారు.

దాదాపు 3 నెలలుగా ఇంట్లోనే ఉంటున్న అమితాబ్, తొలిసారిగా కాలు బయటపెట్టారు. కౌన్ బనేగా కరోర్ పతి ఆడిషన్స్ కోసం ఆయన ముంబయిలోని ఓ స్టుడియోకు వెళ్లారు. కేవలం 5 గంటలు మాత్రమే అక్కడ ఉన్నారు. ఆ తర్వాత నేరుగా ఇంటికొచ్చారు. మధ్యలో ఎవ్వర్నీ టచ్ చేయలేదు. షేక్ హ్యాండ్ ఇవ్వలేదు. స్టుడియోలో ఆయన మాస్క్ కూడా తీయలేదు. అయినప్పటికీ కేవలం ఆ 5 గంటల పర్యటనతో ఆయనకు కరోనా సోకి ఉంటుందని అనుమానిస్తున్నారు.

ఎందుకంటే.. ఆ పర్యటన తర్వాతే శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఎదుర్కొన్నారు అమితాబ్. ఆల్రెడీ ఆయనకు శ్వాసకోశ సమస్యలుండడంతో.. ఎందుకైనా మంచిదని వైద్యుల్ని సంప్రదించారు. కానీ డాక్టర్లకు మాత్రం కరోనా లక్షణాలు కనిపించాయి. వెంటనే పరీక్షలు చేసి చూడగా పాటిజివ్ అని తేలింది.

అలా తనకు కరోనా ఉందనే విషయాన్ని అమితాబ్ గుర్తించారు. ప్రస్తుతం ముంబయిలోని నానావతి హాస్పిటల్ లో ట్రీట్ మెంట్ తీసుకుంటున్నారు బిగ్ బి.