ఓటీటీలో తొలి తెలుగు బడా మూవీ ఇదే

తెలుగుకు సంబంధించి ఓటీటీలో అన్నీ చిన్న సినిమాలే రిలీజ్ అవుతున్నాయి. నిశ్శబ్దం, V లాంటి పెద్ద సినిమాల కోసం ఓటీటీలు ప్రయత్నించినప్పటికీ బడ్జెట్ అడ్డంకుల వల్ల సాధ్యం కాలేదు. అలా బడా హీరోల సినిమాలు లేకుండానే చిన్న సినిమాలకు పరిమితమైంది ఓటీటీ. ఈ నేపథ్యంలో తెలుగులో తొలి ఓటీటీ బడా మూవీగా నిలవబోతోంది ఓ సినిమా. దాని పేరు క్రాక్.

అవును.. రవితేజ-శృతిహాసన్ హీరోహీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాను థియేటర్లలో రిలీజ్ చేయకుండా నేరుగా ఓటీటీకి ఇవ్వాలని ఆలోచిస్తున్నారు. ఈ మేరకు నిర్మాత ఠాగూర్ మధు కొన్ని ఓటీటీ సంస్థలతో సంప్రదింపులు జరుపుతున్నాడు. ఓ సంస్థతో దాదాపు ఒప్పందం కుదిరినట్టు టాక్.

ఇదే కనుక వర్కవుట్ అయితే.. తెలుగుకు సంబంధించి నేరుగా ఓటీటీలోకి వస్తున్న అతిపెద్ద సినిమాగా క్రాక్ నిలవనుంది. ఈ మేరకు రవితేజ నుంచి అనుమతి కూడా తీసుకున్నాడట నిర్మాత.

ప్రస్తుతం రవితేజకు థియేట్రికల్ గా పెద్ద మార్కెట్ లేదు. అతడి సినిమాలకు ప్రొడక్షన్ కాస్ట్ అటుఇటుగా 30 కోట్ల రూపాయల వరకు అవుతోంది. కానీ రెవెన్యూ మాత్రం ఆ స్థాయిలో లేదు. దీంతో బ్రేక్ ఈవెన్ అయ్యేంత ఎమౌంట్ వస్తే ఓటీటీకి క్రాక్ సినిమాను ఇచ్చేయాలని నిర్మాత భావిస్తున్నాడు. ఇలా చేయడం వల్ల నిర్మాతకు థియేట్రికల్ రిలీజ్ ఖర్చులు బాగా మిగులుతాయి.