పవన్ కల్యాణ్ సినిమా టైటిల్ మారిందా!

క్రిష్ దర్శకత్వంలో పవన్ ఓ సినిమా స్టార్ట్ చేసిన సంగతి తెలిసిందే. లాక్ డౌన్ కు ముందే ఈ సినిమాకు సంబంధించి ఓ షెడ్యూల్ పూర్తిచేశారు. ఈ సినిమాకు విరూపాక్షి అనే టైటిల్ అనుకుంటున్నట్టు ప్రచారం జరుగుతోంది. అయితే ఈ టైటిల్ పై ఫ్యాన్స్ పెద్దగా ఇంట్రెస్ట్ చూపించలేదు.

దీంతో విరూపాక్షి టైటిల్ కాకుండా మరో క్యాచీ టైటిల్ కోసం దర్శకుడు క్రిష్ కసరత్తు మొదలుపెట్టాడు. టైటిల్ క్యాచీగా ఉండడంతో పాటు మాస్ అప్పీల్ ఉండేలా చూస్తున్నాడు. పైగా తన కథకు తగ్గట్టు ఆ టైటిల్ ఉండాలి. ఈ క్రమంలో అభిమానులు విరూపాక్షి అనే టైటిల్ కు బదులు బందిపోటు అనే టైటిల్ ను ప్రచారంలోకి తీసుకొచ్చారు.

పవన్-క్రిష్ సినిమాకు బందిపోటు అనే టైటిల్ సరిగ్గా సరిపోతుంది. మొఘల్ కాలం నాటి కథతో వస్తున్న ఈ సినిమాలో పవన్ కల్యాణ్ వజ్రాల దొంగగా కనిపించబోతున్నాడు. సో.. బందిపోటు అనే టైటిల్ సరిగ్గా సరిపోతుంది. మాస్ అప్పీల్ కూడా ఉంది. మరి క్రిష్ ఈ టైటిల్ కే ఫిక్స్ అవుతాడా లేక మరో ప్రత్యామ్నాయం చూస్తున్నాడా అనేది తేలాల్సి ఉంది.