మెగాస్టార్ లిస్ట్ లో మరో కుర్ర డైరక్టర్…

ఇప్పటికే సుజీత్ కు ఛాన్స్ ఇచ్చారు చిరంజీవి. మరో యంగ్ డైరక్టర్ బాబికి కూడా అవకాశం ఇచ్చారు. ఇప్పుడీ లిస్ట్ లోకి మరో కుర్ర డైరక్టర్ చేరబోతున్నాడు. అతడి పేరు ప్రశాంత్ వర్మ.

అవును.. మెగాస్టార్ చిరంజీవికి ఓ కథ వినిపించానంటున్నాడు ప్రశాంత్. లాక్ డౌన్ కంటే ముందే తనకు చిరంజీవికి మధ్య స్టోరీ డిస్కషన్స్ పూర్తయ్యాయని.. ప్రస్తుతం చిరంజీవి నుంచి పిలుపు కోసం ఎదురుచూస్తున్నట్టు తెలిపాడు.

అయితే చిరంజీవి మాత్రం కొత్తగా అవకాశాలిచ్చే పరిస్థితిలో లేరు. ఎందుకంటే ఆయన ముందుగా ఆచార్య ప్రాజెక్టు పూర్తిచేయాలి. ఆ తర్వాత లూసిఫర్ రీమేక్ ను సెట్స్ పైకి తీసుకెళ్లాలి. లిస్ట్ లో ఇంతకుముందే చెప్పుకున్నట్టు బాబి, సుజీత్ తో పాటు త్రివిక్రమ్ కూడా ఉన్నారు.

ఈ కమిట్ మెంట్స్ అన్నీ పూర్తయితే తప్ప ప్రశాంత్ వర్మకు అవకాశం రాకపోవచ్చు.