Telugu Global
National

నాలుగు సీట్లూ బడుగు, బలహీన వర్గాల వారికే...

పిల్లి సుభాష్ చంద్రబోస్, మోపిదేవి వెంకటరమణలు రాజ్యసభకు ఎన్నిక కావడంతో ఖాళీ అయిన రెండు ఎమ్మెల్సీ స్థానాలతో పాటు… గవర్నర్ కోటాలో మరో రెండు ఎమ్మెల్సీ స్థానాలనూ బడుగు, బలహీనవర్గాలతోనే భర్తీ చేయాలని ముఖ్యమంత్రి జగన్‌మోహన్ రెడ్డి నిర్ణయించుకున్నారు. ఆగ్రవర్ణాలకు చెందిన కొందరు నేతలకు ఇది వరకే జగన్‌ హామీ ఇచ్చినప్పటికీ… ప్రస్తుత పరిస్థితుల్లో దళితులు, బీసీలు, మైనార్టీలను మరింత ఆకట్టుకోవాలని జగన్‌ నిర్ణయించారు. ఇందులో భాగంగా నాలుగు ఎమ్మెల్సీ స్థానాలనూ బీసీ, ఎస్సీ, మైనార్టీలతో భర్తీ […]

నాలుగు సీట్లూ బడుగు, బలహీన వర్గాల వారికే...
X

పిల్లి సుభాష్ చంద్రబోస్, మోపిదేవి వెంకటరమణలు రాజ్యసభకు ఎన్నిక కావడంతో ఖాళీ అయిన రెండు ఎమ్మెల్సీ స్థానాలతో పాటు… గవర్నర్ కోటాలో మరో రెండు ఎమ్మెల్సీ స్థానాలనూ బడుగు, బలహీనవర్గాలతోనే భర్తీ చేయాలని ముఖ్యమంత్రి జగన్‌మోహన్ రెడ్డి నిర్ణయించుకున్నారు.

ఆగ్రవర్ణాలకు చెందిన కొందరు నేతలకు ఇది వరకే జగన్‌ హామీ ఇచ్చినప్పటికీ… ప్రస్తుత పరిస్థితుల్లో దళితులు, బీసీలు, మైనార్టీలను మరింత ఆకట్టుకోవాలని జగన్‌ నిర్ణయించారు.

ఇందులో భాగంగా నాలుగు ఎమ్మెల్సీ స్థానాలనూ బీసీ, ఎస్సీ, మైనార్టీలతో భర్తీ చేయనున్నారు.

రాజ్యసభకు ఎన్నికైన పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌, మోపిదేవి వెంకటరమణల ఎమ్మెల్సీ స్థానాలను తిరిగి బీసీలతో భర్తీ చేయనున్నారు. గవర్నర్ కోటాలో ఎన్నికైన కంతేటి సత్యనారాయణ, రత్నాబాయిల పదవీకాలం ముగియడంతో ఆ రెండు స్థానాల్లో ఒకటి ఎస్సీలకు, మరొకటి మైనార్టీలకు కేటాయించాలని జగన్ నిర్ణయించుకున్నారు.

ఎమ్మెల్సీ స్థానాలపై రెడ్డి సామాజికవర్గం వారు, ఇతర వర్గాల వారు ఆశలు పెట్టుకోకుండా ముందే వాటిని బడుగు బలహీనవర్గాలతో భర్తీ చేస్తున్నట్టు పార్టీ పెద్దలు స్పష్టమైన సంకేతాలను సొంత మీడియా ద్వారానే పంపుతున్నారు.

First Published:  12 July 2020 9:03 PM GMT
Next Story