అమితాబ్ కు చికిత్స అక్కర్లేదు

బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ కు కరోనా సోకిన సంగతి తెలిసిందే. అభిషేక్ కు కూడా పాజిటివ్ రాగా.. ఇద్దరూ ముంబయిలోని నానావతి హాస్పిటల్ లో హుటాహుటిన జాయిన్ అయ్యారు. తండ్రికొడుకులిద్దరికీ పూర్తిగా పరీక్షలు నిర్వహించిన వైద్యులు.. వాళ్లకు కరోనాకు ఇచ్చే పూర్తిస్థాయి చికిత్స అవసరం లేదని నిర్థారించారు.

బిగ్ బి గొంతు నొప్పి, జ్వరంతో బాధపడుతున్నారు. ఆయనకిప్పుడు జ్వరం అదుపులోకి వచ్చింది. కొంచెం ఒళ్లు నొప్పులు మాత్రం ఉన్నాయి. మరోవైపు అభిషేక్ కు అస్సలు కరోనా లక్షణాలు లేవని ప్రకటించిన వైద్యులు.. కేవలం అతడ్ని అబ్జర్వేషన్ లో ఉంచినట్టు తెలిపారు.

మరోవైపు కరోనా సోకిన ఐశ్వర్యరాయ్ ను, ఆమె కూతురు ఆద్యను ఇంట్లోనే ఉంచి చికిత్స అందిస్తున్నారు వైద్యులు. వీళ్లకు కూడా ఎలాంటి కరోనా లక్షణాలు లేవని ప్రకటించిన వైద్యులు.. మరో 5 రోజుల పాటు స్వల్ప చికిత్స అందించి, ఆ తర్వాత మరోసారి కరోనా పరీక్షలు నిర్వహిస్తామని ప్రకటించారు.