కేరళ బాటలోనే తెలంగాణ… త్వరలోనే ఆన్‌లైన్‌ క్లాస్‌లు !

కరోనా కాలంలో కేరళలో ఆన్‌లైన్‌ క్లాస్‌లు దిగ్విజయంగా నడుస్తున్నాయి. జూన్‌ 1 నుంచి క్లాస్‌లు నిర్వహిస్తున్నారు. ప్రభుత్వానికి చెందిన చానల్‌ ద్వారా టీవీల్లో పాఠాలు చెబుతున్నారు. అదేటైమ్‌లో యూ ట్యూబ్‌లో వాటిని అప్‌లోడ్‌ చేస్తున్నారు.

స్మార్ట్‌ఫోన్‌ లేనివారు, టీవీలు లేని వారికి అంగన్‌వాడీల్లో టీవీలు పెట్టారు. గ్రామంలో ఎవరైనా విద్యార్థిని ఇంట్లో టీవీ లేకపోతే వారిని అంగన్‌వాడీ సెంటర్‌కు తీసుకొచ్చే బాధ్యతను గ్రామ సర్పంచ్‌కు అప్పగించారు. స్థానిక సంస్థలను ఇన్‌వాల్వ్‌ చేసి ఇలా సక్సెస్‌పుల్‌గా కేరళ సర్కార్‌ ఆన్‌లైన్‌ క్లాస్‌లు నిర్వహిస్తోంది. కరోనా కాలంలో టెన్త్‌ క్లాస్ ఎగ్జామ్స్‌ పూర్తి చేసింది.

తెలంగాణలో కూడా ఆన్‌లైన్‌ క్లాస్‌లు నిర్వహించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. వారం, పది రోజుల్లో క్లాస్‌లు స్టార్ట్‌ చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. డీడీ యాదగిరి, టీశాట్‌, లోకల్‌ కేబుల్‌ ద్వారా ఆన్‌లైన్‌ క్లాస్‌లు లైవ్‌ టెలికాస్ట్‌ చేయాలని సర్కార్‌ నిర్ణయం తీసుకుంది.

అయితే ఎవరైనా ఇంట్లో టీవీలు లేకపోతే వారి ఫ్రెండ్స్‌ ఇంట్లో..అక్కడ కూడా లేకపోతే స్కూల్లో వినేలా ఏర్పాట్లు చేయబోతున్నారు.

ఇప్పటికే స్కూళ్లకి ఉచితంగా‌ పంపిణీ చేశారు. ఈ నెల 20లోగా అన్ని స్కూళ్లలో విద్యార్థులకు బుక్స్ అందజేస్తారు. ఆతర్వాత నుంచి ఆన్‌లైన్‌ క్లాస్‌లు ప్రారంభించాలని ప్రభుత్వం భావిస్తోంది.

ఇప్పటికే విద్యాసంవత్సరం ప్రారంభం కావాల్సి ఉంది. అయితే కరోనా వల్ల నెలరోజులు ఆలస్యమైంది. ఇలాగే లేట్‌ చేస్తే విద్యా సంవత్సరం నష్టపోవాల్సి వస్తుంది. అందుకే ఆన్‌లైన్‌ క్లాస్‌లు నిర్వహించాలని ప్రభుత్వం చూస్తోంది. రోజుకు రెండు నుంచి మూడు గంటలు టీవీల్లో పాఠాలు చెప్పేలా ప్రణాళికలు రచిస్తోంది. హైకోర్టు అనుమతి వచ్చిన వెంటనే ఆన్‌లైన్‌ తరగతులు నిర్వహించే షెడ్యూల్‌ ప్రకటించనున్నారు.