లాక్ డౌన్ లో కూడా అదే స్పీడు

ఓవైపు షూటింగ్స్ ఆగిపోయాయి. మరోవైపు థియేటర్లు మూతపడ్డాయి. పరిశ్రమ అంతా స్తంభించిపోయింది. హీరోలంతా ఇళ్లకే పరిమితమైపోయారు. అయితే ఒక్క హీరో మాత్రం చెలరేగిపోతున్నాడు. వరుసపెట్టి సినిమాలు ఎనౌన్స్ చేస్తున్నాడు. అతడే విశ్వక్ సేన్.

లాక్ డౌన్ అమల్లో ఉన్న టైమ్ లోనే పాగల్ అనే సినిమాను ప్రారంభించాడు విశ్వక్ సేన్. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ లో పాల్గొంటాడు. దీంతో పాటు హిట్ సినిమాకు సీక్వెల్ లో కూడా నటించబోతున్నాడు. మరోవైపు తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో ఈ నగరానికి ఏమైంది సీక్వెల్ లో కూడా నటించబోతున్నాడు.

ఈ సినిమాలకు అదనంగా గామి అనే సినిమా ప్రకటించాడు. విద్యాథర్ దర్శకత్వంలో రాబోతున్న ఈ సినిమాలో అఘోరాగా కనిపించబోతున్నాడు విశ్వక్ సేన్. తాజాగా కప్పెళ రీమేక్ లో కూడా నటించడానికి ఒప్పుకున్నాడు.

పూర్తిస్థాయిలో పరిశ్రమ కార్యకలాపాలు మొదలైన వెంటనే ఈ సినిమాల్ని బ్యాక్ టు బ్యాక్ పూర్తిచేయాలని ఫిక్స్ అయ్యాడు ఈహీరో. ప్రస్తుతం ఇతడు సినిమాకు కేవలం కోటిన్నర నుంచి 2 కోట్లు మాత్రమే పారితోషికంగా తీసుకుంటున్నాడు. ఎక్కువ మంది నిర్మాతల్ని ఆకర్షిస్తున్న అంశం ఇదే.