అఖిల్ లిస్ట్ లో మరో డైరక్టర్

చేసేది ఒక్క సినిమానే అయినప్పటికీ పైప్ లైన్లో మాత్రం ఇద్దరు ముగ్గురు దర్శకుల్ని ఉంచుతాడు అఖిల్. ఇది అతడి స్టయిల్. సక్సెస్ లేకపోయినా ఈ హీరోకు అవకాశాలు మాత్రం బాగానే వస్తున్నాయి. అందుకే నచ్చిన స్క్రిప్ట్ ఎంచుకోగలుగుతున్నాడు. ఇందులో భాగంగా మరో డైరక్టర్ పేరు అఖిల్ లిస్ట్ లోకి వచ్చి చేరింది. అతడి పేరు వీరుపోట్ల.

చాన్నాళ్లుగా లైమ్ లైట్లో లేని వీరుపోట్ల, అఖిల్ కోసం ఓ యూత్ మాస్ సబ్జెక్ట్ రెడీ చేసి పెట్టుకున్నాడు. రీసెంట్ గా ఆ కథను అఖిల్ కు వినిపించాడు కూడా. అఖిల్ మాత్రం తన నిర్ణయాన్ని పెండింగ్ లో పెట్టాడు.

ప్రస్తుతం బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ అనే సినిమా చేస్తున్నాడు అఖిల్. ఈ సినిమా కంప్లీట్ అయిన తర్వాతే మరో మూవీపై నిర్ణయం తీసుకుంటాడు. మరోవైపు లిస్ట్ లో సురేందర్ రెడ్డి పేరు కూడా వినిపిస్తోంది. నిజంగా సురేందర్ రెడ్డి, అఖిల్ తో సినిమా తీయడానికి ముందుకొస్తే.. వీరుపోట్లకు హ్యాండ్ తప్పదు.