మణిశర్మ చెప్పిన ఆచార్య సంగతులు

14 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత మరోసారి కలిశారు చిరంజీవి-మణిశర్మ. మెగాస్టార్ నటిస్తున్న ఆచార్య సినిమాకు సంగీతం అందిస్తున్నాడు మణిశర్మ. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ లో తిరుగులేదని నిరూపించుకున్న ఈ మ్యూజిక్ డైరక్టర్.. ఆచార్యలో మ్యూజిక్ పై స్పందించాడు.

మణిశర్మ చెప్పిన వివరాల ప్రకారం ఆచార్యలో 5 పాటలున్నాయి. కావాలనే 6 పాటల్ని, 5కు కుదించారట. ఇక ఈ 5 సాంగ్స్ లో ఒకటి ఐటెంసాంగ్. ఆ పాట కంపోజిషన్ ఆల్రెడీ పూర్తయింది. చిరంజీవి-రెజీనా మధ్య ఆ సాంగ్ ను షూట్ చేశారు.

5 పాటల్లో ఓ ఎమోషనల్ సాంగ్ కూడా ఉంది. అదొక మాంటేజ్ సాంగ్. ఇక మిగిలిన 3 పాటలు డ్యూయట్స్. చిరంజీవి-కాజల్ మధ్య ఈ పాటలు వస్తాయి.

ఇలా ఆచార్యలో పాటలకు సంబంధించి వివరాలు బయటపెట్టాడు మణిశర్మ. సినిమాకు సంబంధించి పాటలు ఫైనలైజ్ అయిపోయాయనని.. ప్రస్తుతం తనకు ఓ పాట కంపోజిషన్ తో పాటు.. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ వర్క్ ఉందని తెలిపాడు.